అన్ని శాఖల సమన్వయంతో ఈనెల 19 న జరగనున్న అనంత పద్మనాభస్వామి దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. దీపోత్సవ నిర్వహణ సన్నద్ధతపై బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ భక్తులు ఎంత ఎక్కువ సంఖ్యలో వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దురదృష్టకర సంఘటనను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భక్తులకు మంచి అనుభూతి కలిగేలా దీపోత్సవ నిర్వహణ
ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వ హామీల్లో భాగంగా ఉచిత బస్సు సదుపాయం కల్పించిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి దీపోత్సవానికి వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఆలయానికి ఘాట్ రోడ్డు సౌకర్యాన్ని కల్పించడం.. దెబ్బతిన్న ఆలయ కలశాన్ని పున ప్రతిష్ట చేయడం.. ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనంత పద్మనాభస్వామి వారి దీపోత్సవ పోస్టర్ ను గంటా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.సంగీత్ మాధుర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ, ఏసీపీ అప్పలరాజు, భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమిన రామస్వామి నాయుడు, ఈఓ రాజు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, కోరాడ రమణ, కసిరెడ్డి దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్, గాడు వెంకటప్పడు, రామరాజు, మొకర అప్పలనాయుడు, తాట్రాజు అప్పారావు, కాళ్ల సత్యనారాయణ, ఎంపీపీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా దీపోత్సవం భీమిలి ఎమ్మెల్యే గంటా
అన్ని శాఖల సమన్వయంతో ఈనెల 19 న జరగనున్న అనంత పద్మనాభస్వామి దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. దీపోత్సవ నిర్వహణ సన్నద్ధతపై బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ భక్తులు ఎంత ఎక్కువ సంఖ్యలో వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దురదృష్టకర సంఘటనను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భక్తులకు మంచి అనుభూతి కలిగేలా దీపోత్సవ నిర్వహణ ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వ హామీల్లో భాగంగా ఉచిత బస్సు సదుపాయం కల్పించిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి దీపోత్సవానికి వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఆలయానికి ఘాట్ రోడ్డు సౌకర్యాన్ని కల్పించడం.. దెబ్బతిన్న ఆలయ కలశాన్ని పున ప్రతిష్ట చేయడం.. ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనంత పద్మనాభస్వామి వారి దీపోత్సవ పోస్టర్ ను గంటా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.సంగీత్ మాధుర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ, ఏసీపీ అప్పలరాజు, భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమిన రామస్వామి నాయుడు, ఈఓ రాజు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, కోరాడ రమణ, కసిరెడ్డి దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్, గాడు వెంకటప్పడు, రామరాజు, మొకర అప్పలనాయుడు, తాట్రాజు అప్పారావు, కాళ్ల సత్యనారాయణ, ఎంపీపీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

