రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలానికి చెందిన ఒక యువకుడు ప్రతిభతో దేశానికి గర్వకారణంగా నిలిచాడు. IITలో బీటెక్ పూర్తి చేసిన ఆయన, ప్లేస్‌మెంట్ ద్వారా ప్రముఖ కంపెనీలో ఉద్యోగం పొందాడు. అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి మరో అంతర్జాతీయ సంస్థలో అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో పనిచేస్తూ, ఏకంగా రూ.2.5 కోట్లు వార్షిక ప్యాకేజీతో సేవలు అందిస్తున్నాడు.
గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ యువకుడు కృషి, పట్టుదలతో అగ్రశ్రేణి సంస్థల్లో ఎదుగుతూ ఉన్నత స్థానానికి చేరుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయన, విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించాడు.


