అన్నమయ్య జిల్లా కేంద్ర సాధన సమితి పిలుపుతో రాజంపేట పాత బస్టాండ్ సర్కిల్ నుంచి ప్రారంభమైన జేఏసీ ర్యాలీ అపూర్వంగా విజయవంతమైంది. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల నాయకులు, మహిళలు,విద్యార్థులు, వివిధ సంఘాలు,రాజకీయ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రాజంపేటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ గళమెత్తారు.ఈ ర్యాలీలో జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ప్రముఖంగా పాల్గొన్నారు. అనంతరం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కలిసి సబ్ కలెక్టర్ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ రాజంపేటకు రోడ్డు, రైల్వే, విమాన సౌకర్యాలు సమృద్ధిగా ఉండటం,అన్నమయ్య నడయాడిన తాళ్లపాక గ్రామానికి అత్యంత సమీపంలో ఉండటం, ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాలు రాజంపేటలో ఉండటం,అలాగే రాజంపేట పార్లమెంటు ప్రధాన కేంద్రం కావటం ఇవన్నీ రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి అవసరమైన అర్హతలన్నీ రాజంపేటకే ఉన్నాయని తెలిపారు.గత పాలకులు స్వప్రయోజనాల కోసం జిల్లా కేంద్రాన్ని వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసారని,ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల న్యాయమైన అభిలాషను గుర్తించి రాజంపేటనే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,రాజకీయ పార్టీలు,విద్యాసంస్థల ప్రతినిధులు,వ్యాపార వర్గాలు, కుల,విద్యార్థి సంఘాల నాయకులు మరియు ప్రజలు భారీగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని ఏకగళ స్వరం