దక్షిణ నియోజకవర్గం
39వ వార్డులో దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని నిర్వహించనున్న మహా అన్నదానానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10,000 విరాళం అందజేశారు. ఆసీలమెట్ట కార్యాలయంలో ఉత్సవ కమిటీ సభ్యులకు
వైయస్సార్సీపి 39 వ వార్డు అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో పదివేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కుల మతాలు అతీతంగా దక్షిణ నియోజకవర్గంలో భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని పండుగలు
ఘనంగా జరుగుతాయన్నారు. ఏడాది దసరా ఉత్సవాలు కూడా దక్షిణ నియోజకవర్గంలో అంబరాన్నంటాయన్నారు. వైయస్ఆర్సీపీ 39 వ వార్డు అధ్యక్షుడు, ముస్లిం విభాగం నాయకులు ముజీబ్ ఖాన్ దసరా అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ముందుకు రావడం అభినందనీయమన్నారు. పేదవాడి ఆకలి నింపే ఏ కార్యక్రమానికైనా తాను ముందు ఉంటానని, అలాగే తనతో నడిచే వైఎస్ఆర్సిపి దక్షిణ శ్రేణులు కూడా కలిసి నడవడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ,
జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, వార్డు అధ్యక్షుడు పీతల వాసు వైఎస్ఆర్సిపి నాయకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అన్నదానానికి వాసుపల్లి రూ. 10,000లు వితరణ 39వ వార్డు అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ చేతుల మీదుగా అందజేత
దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులో దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని నిర్వహించనున్న మహా అన్నదానానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10,000 విరాళం అందజేశారు. ఆసీలమెట్ట కార్యాలయంలో ఉత్సవ కమిటీ సభ్యులకు వైయస్సార్సీపి 39 వ వార్డు అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో పదివేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కుల మతాలు అతీతంగా దక్షిణ నియోజకవర్గంలో భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని పండుగలు ఘనంగా జరుగుతాయన్నారు. ఏడాది దసరా ఉత్సవాలు కూడా దక్షిణ నియోజకవర్గంలో అంబరాన్నంటాయన్నారు. వైయస్ఆర్సీపీ 39 వ వార్డు అధ్యక్షుడు, ముస్లిం విభాగం నాయకులు ముజీబ్ ఖాన్ దసరా అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ముందుకు రావడం అభినందనీయమన్నారు. పేదవాడి ఆకలి నింపే ఏ కార్యక్రమానికైనా తాను ముందు ఉంటానని, అలాగే తనతో నడిచే వైఎస్ఆర్సిపి దక్షిణ శ్రేణులు కూడా కలిసి నడవడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, వార్డు అధ్యక్షుడు పీతల వాసు వైఎస్ఆర్సిపి నాయకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

