తొట్టంబేడు, నవంబర్ 28, పున్నమి న్యూస్: తొట్టంబేడు మండలం తంగేళ్ళ పాలెం పిఏసియస్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ తొట్టంబేడు మండల అధ్యక్షుడు రావెళ్ళ మునిరాజా నాయుడు,తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్ సంయుక్తంగా రైతులకు శుక్రవారం నాడు యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ” పథకం కింద వరుసగా రెండు విడతల్లో కలిసి రూ.6,310 కోట్ల మేర ఆర్థిక సాయం అందించడం రైతాంగానికి పెద్ద ఊరటని హర్షం వ్యక్తం చేశారు. తంగేళ్ళ పాలెం పిఏసియస్ పరిధిలో ఇప్పటి వరకు 144 టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామని అన్నదాత ఆనందమే కూటమి ప్రభుత్వ ధ్యేయంమని రైతన్నల వ్యవసాయ అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే పెట్టుబడి భారం తగ్గి,రైతు ఆత్మవిశ్వాసం పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ నవశకం చంద్రబాబు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు,అగ్రిటెక్ వినియోగం,ఫుడ్ ప్రాసెసింగ్,ప్రభుత్వ మద్దతు అనే ‘పంచ సూత్రాలు’ ప్రకటించారని తెలిపారు. అన్నదాత సుఖీభవ,సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్,రికార్డు స్థాయిలో ధాన్యం కొనడమే కాకుండా వెంటనే డబ్బు జమచేయడం, రైతుకు నష్టం రాకుండా మామిడి,పొగాకు,కోకో,కాఫీ,మిర్చి, టమాటా,ఉల్లి పంటలకు వందల కోట్ల సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటూ… అన్ని విధాలా రైతుకు అండగా నిలుస్తోన్న చంద్రబాబు ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. రైతు పండించిన పంట ఉత్పత్తులను శుద్ధి చేసి,నిల్వ పెట్టి,విలువను జోడించి, మార్కెట్ కూడా కల్పించే ఆహార శుద్ధి పరిశ్రమలను చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.మొత్తం రూ.21,000 పెట్టుబడులతో ఏర్పాటయ్యే 402 యూనిట్లతో రైతుకు అదనపు ఆదాయం రావడమే కాదు,ప్రాంతీయంగా ఉద్యోగాలు కూడా వస్తాయని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి రైతులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని, కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎంచుకుని… ఆ టైమ్ కి అక్కడికి వెళ్లి ఏ సమస్యా లేకుండా ధాన్యం అమ్ముకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ లో 7337359375 నెంబర్ ను ప్రభుత్వం కేటాయించడం జరిగిందిని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు నాయకుడు చిల్లకూరు బాలసుబ్రహ్మణ్యం మణి,చంద్రబాబు,రామచంద్ర, పిఏసియస్ అధికారి చిరంజీవులురెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

అన్నదాత ఆనందమే కూటమి ప్రభుత్వ ధ్యేయం-మునిరాజనాయుడు