శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఉన్న అర్ధనారీశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి నాడు విద్యుత్ సరఫరా అంతరాయంతో అర్ధనారీశ్వరాలయం అంధకారంలో ఉండిపోయి విద్యుత్ దీపాలులేక అలయావరణం అంతా చీకటిగా మారిన పరిస్తితి చూసి కార్తీక పౌర్ణమి నాడు శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారి దర్శనార్ధం వచ్చిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్కడి పరిస్థితులు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆలయానికి విధ్యుత్ సరఫరా చియ్యవరం గ్రామం నుండి ఇవ్వడం పై మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కార్తీక పౌర్ణమి నాడు అర్ధనారీశ్వర స్వామి ఆలయానికి వచ్చే మహిళలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఈ పాపం ఎవరిని విడిచిపెట్టదని కార్తీకమాసంలో ఈ ఆలయానికి మహిళలు అధిక సంఖ్యలో వస్తుంటారని స్వామివారి ఆలయంలో కనీసం విద్యుత్తు సరఫరా కూడా లేకపోవడం చాలా బాధాకరమన్నారు. అలాగే శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఉన్న శివాలయానికి చియ్యవరం గ్రామ నుండి విద్యుత్ సరఫరా ఇవ్వడం అందులో ఇవాళ విద్యుత్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే స్వామివారి ఆలయానికి వెళ్లే రోడ్డు సరిగ్గా లేక అక్కడికి వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జారిపడటం చూస్తుంటే ఈ పాపంకి కారకులైన వారిని శివయ్య కఠినంగా శిక్షిస్తాడన్నారు. స్వామివారి ఆలయానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పదివేల లోడ్లు ఇసుక దోచుకుని కనీసం 10 లోడ్లతో కూడా స్వామివారి ఆలయం రోడ్లు వేయాలనిపించలేదని అసహనం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి అనుబంధం ఆలయాలపై శ్రద్ధ లేని ఈవో దేవస్థానం ఏసి రూమ్ లో కూర్చుని కలెక్షన్లకే పరిమితమయ్యారని భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న దేవస్థానం ఈవో దీనిపై 24 గంటల్లో సమాధానం చెప్పాలని లేకుంటే తానే ధర్నాకి దిగుతానని అయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉత్తరాజి సర్వణ కుమార్, కంట ఉదయ్ కుమార్, కొల్లూరు హరి నాయుడు, టైలర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అనుబంధ ఆలయాలపై శ్రద్ధ చూపని దేవస్థాన ఈ.వో – మాజీ ఎమ్మెల్యే