నెల్లూరు, జూలై 01, 2020 (పున్నమి విలేఖరి) : ఏపీ జలవనరుల శాఖామంత్రి డాక్టర్ అనిల్ కుమార్ స్టైల్ మార్చారా..?.. విమర్శకు..ప్రతివిమర్శ..తన సిద్ధాంతం అన్నట్లుగా ప్రత్యర్ధులు.. ప్రతిపక్షాలు పై ఒంటికాలుపై లేచే అనిల్ రాజకీయ పంథా మార్చారా… గత రెండురోజులుగా మంత్రి.. మాటాలు.. విమర్శలు పరిశీలిస్తే ఆయన ఆగ్రహాన్ని.. కాసేపు వదిలేసినట్లనిపిస్తోంది.. నెల్లూరులో ఏది జరిగినా రాజకీయాలతో ముడిపెట్టడం ఇక్కడి ప్రత్యేకత… ఈ క్రమంలో నిన్న నెల్లూరులో మంత్రి అనీల్ పై టీడీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి నేరుగా విమర్శలు చేశారు.. సంగం పైప్ లైన్.. మలిదేవి డ్రైన్.. టెండర్లలో తొమ్మిది కోట్ల అవినీతి కి పాల్పడ్డారంటూ మంత్రి పై ఆరోపణలు చేశారు… ఇవాళ నెల్లూరొచ్చిన మంత్రి అంతేస్తాయిలో కౌంటర్ ఇస్తారనుకున్నారు.. వైసీపీ నేతలు.. వైసీపీనే కాదు టీడీపీ నాయకులు సైతం అదే భవనలో ఉన్నారు.. అయితే మంత్రి అనీల్ అందుకు భిన్నమైన వైఖరి చూపారు..టీడీపీ నేతకు స్థాయి లేదనుకున్నారో… లేక తనది కాని ఆరోపణలకు ఆన్సర్ చేయడమెందుకు అనుకుంటున్నారో మరి విమర్శలు మాట అటుంచి టీడీపీ నేతలపై చెణుకులు వేశారు.జిల్లాలో ఎక్కడ ఏది జరిగినా కొందరు తనకు అంతగట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు… అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.. టిడిపి నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు…తనను తిడితే ప్రతిపక్ష పార్టీల్లో కొందరికి అక్కడ పదోన్నతులు వస్తాయని ఆరాటపడుతున్నట్లుంది… తనవల్ల ప్రతిపక్షాల నాయకులకు పదోన్నతులు వస్తే ఆనందమే కదా అన్నారు..ఎవరెన్ని విమర్శలు చేసినా..అభివృద్ధి తన అజెండా అన్నారు. అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, రాజకీయ ప్రస్థానంలో లేవు.. ఉండవు అని మంత్రి అనిల్ చెప్పారు.గత టీడీపీ హయాంలో ఇద్దరు అనుచరులను దారుణంగా హత్యచేశారు.. ప్రతీకారం నా రాజకీయాలు కాదు అని మంత్రి తన మార్పు …మార్క్ స్టయిల్ ప్రదర్శించారు..మంత్రిలో వచ్చిన మార్పుతో అనుచరులు బిత్తరపోయారు..