అనాధ శవానికి దహన క్రియలు చేసిన బోలా శంకర్ సేవాసమితి
రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు మండలం శాంతినగర్ కు చెందిన పసుపులేటి నరసమ్మ అనారోగ్యంతో మృతి ఈమె శివాలయం వద్ద భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించేది ఈమెకు భర్త. కుమార్తె. అల్లుడు ఉన్నారు .ఈమెకు వారితో 35 సంవత్సరముల క్రితం మే సంబంధాలు తెగిపోయాయి ఈమె మరణ వార్త తెలుసుకున్న వారు మేము అంత్యక్రియలకు రాలేము మేము చేయము మీరే చేయండి అని.కొంత డబ్బు ఇవ్వగా చుట్టుపక్కల వారికి చెప్పటంతో బోలా శంకర్ సేవా సమితిఅధ్యక్షులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు రంగనాయకులపేట వైసిపి ఇన్చార్జ్ యనమల రత్నయ్య శాంతినగర్ వైసిపి ఇన్చార్జ్ షేక్ మౌలా .వాసబాబు .శివాలయం అర్చకులు యోగి స్వామి గార్లకు తెలియజేయగా వీరి సహాయ సహకారాలతో కోడూరు హిందూ స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలునిర్వహించారు.


