అనాధాశ్రమం కోసం బియ్యం బట్టలు సేకరిస్తున్న విస్డం సెంట్రల్ స్కూల్
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు మండలం స్థానిక కొత్త బజారులోని విస్డం సెంట్రల్ స్కూల్ ఆధ్వర్యంలో
అనాధ పిల్లల మరియు వృద్ధుల కోసం బియ్యము బట్టలు కావాలని చెప్పడంతో స్కూల్ విద్యార్థులు మేమున్నామని భరోసా ఇచ్చి స్కూల్లోని ప్రతి ఒక్క విద్యార్థి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించడం జరిగిందని విస్డం సెంట్రల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు మరియు అధ్యాపక బృందం. కేవలం చదివే కాదు పేదలకు అనాధలకు వృద్ధులకు సహాయం చేయడంలో కూడా మేము ముందున్నాము అని నిరూపిస్తున్న రైల్వే కోడూర్ విస్డం సెంట్రల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు. ఇప్పటివరకు 600 కేజీల బియ్యం పాత బట్టలు అలాగే నగదు సేకరించి వారికి కావలసిన ప్లేట్లు మొగులు బకెట్లు, దుప్పట్లు అందజేయుటకు సిద్ధంగా ఉన్న విస్డం సెంట్రల్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ టి ప్రదీప్, ప్రిన్సిపాల్ ప్రియాంక ఇంచార్జ్ ముఖేష్ ,ఉంగరాల శివప్రకాష్ కు అందజేయడం జరిగినదని. బైసాని కారుణ్య శ్రీ ఆరవ తరగతి, బైసాని వకృత్ సాయి మూడవ తరగతి వారికి బియ్యము బట్టలు ఇవ్వడం జరిగినది.


