నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయి అనాధగా మిగిలిపోయిన మాడుగులపల్లి మండలం ఆగమోత్కూర్ కు చెందిన బాలిక నిత్యకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు.
గురువారం ఆమె నల్గొండ జిల్లా వేములపల్లి మండలం కార్యాలయంలో చేపట్టిన ఆధునీకరణ పనుల పరిశీలన నిమిత్తం వేములపల్లికి వచ్చారు. మాడుగుల పల్లి మండలం ఆగామోత్కూర్ కు చెందిన తండ్రి,కొడుకులు పున్న సాంబయ్య, శివమణిలు, గణేష్ నిమజ్జనం సందర్భంగా వేములపల్లి వద్ద ఉన్న కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతు కాగా ఇదివరకే తల్లి ని కోల్పోయిన చిన్నారి నిత్య, తండ్రి, సోదరుడిని కూడా కోల్పోవడంతో అనాధగా మిగిలిపోయింది. ఈ విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ చిన్నారి నిత్యకు అండగా నిలిచే క్రమంలో భాగంగా వేములపల్లి తహసిల్దార్ కార్యాలయంలో నిత్యకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందించి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని బాగా చదువుకోవాలని అన్నారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, వేములపల్లి,మాడుగులపల్లి తహ సిల్దార్లు హేమలత, సరోజ పావని, డిప్యూటీ తహ సిల్దార్ తదితరులు ఉన్నారు.

అనాధగా మిగిలిపోయిన బాలికకు ధైర్యం చెప్పిన : కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయి అనాధగా మిగిలిపోయిన మాడుగులపల్లి మండలం ఆగమోత్కూర్ కు చెందిన బాలిక నిత్యకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా వేములపల్లి మండలం కార్యాలయంలో చేపట్టిన ఆధునీకరణ పనుల పరిశీలన నిమిత్తం వేములపల్లికి వచ్చారు. మాడుగుల పల్లి మండలం ఆగామోత్కూర్ కు చెందిన తండ్రి,కొడుకులు పున్న సాంబయ్య, శివమణిలు, గణేష్ నిమజ్జనం సందర్భంగా వేములపల్లి వద్ద ఉన్న కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతు కాగా ఇదివరకే తల్లి ని కోల్పోయిన చిన్నారి నిత్య, తండ్రి, సోదరుడిని కూడా కోల్పోవడంతో అనాధగా మిగిలిపోయింది. ఈ విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ చిన్నారి నిత్యకు అండగా నిలిచే క్రమంలో భాగంగా వేములపల్లి తహసిల్దార్ కార్యాలయంలో నిత్యకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందించి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని బాగా చదువుకోవాలని అన్నారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, వేములపల్లి,మాడుగులపల్లి తహ సిల్దార్లు హేమలత, సరోజ పావని, డిప్యూటీ తహ సిల్దార్ తదితరులు ఉన్నారు.

