Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Anakapalli

అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

Punnami Newsroom Published:
అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

Story highlights

  • అనకాపల్లి సబ్‌ డివిజన్ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్‌లో విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు.
  • జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్‌తో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు.
  • ఈ సందర్భంగా అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను అనుసంధానించే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు.స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళికలు రూపొందించాలి ఆపరేషన్ త్రిశూల్‌ను పటిష్టంగా అమలు చేయాలి: విశాఖ రేంజ్…

అనకాపల్లి సబ్‌ డివిజన్ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్‌లో విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్‌తో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను అనుసంధానించే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు.స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళికలు రూపొందించాలి
ఆపరేషన్ త్రిశూల్‌ను పటిష్టంగా అమలు చేయాలి: విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి,సీసీటీవీ కెమెరాలు నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, ట్రాఫిక్ నిర్వహణలో మూడో నేత్రంలా పనిచేస్తాయని ఐజీ గోపీనాథ్ జట్టి పేర్కొన్నారు. వ్యాపార సముదాయాలు, వీధుల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక గ్రామాలు, వార్డులను ముందుగానే గుర్తించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఐజీ ఆదేశించారు. గత ఎన్నికల పరిస్థితులు, ప్రస్తుత క్షేత్రస్థాయి నివేదికలను పరిగణనలోకి తీసుకుని భద్రతా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి, పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *