అనంతసాగరం మండలంలోప్రతి ఇంటికి నీటి సరఫరా: ఎంపీడీవో మధుసూదన్ రావు

0
147

ప్రతి ఇంటికి నీటి సరఫరా… ఎంపీడీఓ ఏ. మధుసూదన్ రావు.

అనంతసాగరం మండలం లోని కేంద్ర ప్రభుత్వం నిధులతో జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీటిని అందించనున్నట్లు ఎంపీడీఓ ఏ.మధుసూదన్ రావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన అనంతసాగరం లోని మండల అభివృద్ధి కార్యాలయంలో శనివారం మండల స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా త్రాగునీటి ఎద్దడి నివారించేందుకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని పంచాయతి కార్యదర్శిలకు ఆయన సూచించారు.పాత బోర్లు మరమ్మతులు ఉంటే చేయించుకోవాలన్నారు.RWSజె.ఈ. సుదర్శన్ బాబు మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు.జల జీవన్ మిషన్ 100 రోజుల ప్రచార కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన అన్నారు.మండలం లోని ఇనగళూరు, గార్లదిన్నె పాడు ,మంగుపల్లి, లింగంగుంట గ్రామాలకు నీటి కుళాయిలు లేని ఇండ్లకు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ.ఓ.పి.ఆర్.డి.శ్రీనివాసరావు, పంచాయితీ కార్యదర్శిలు ,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ,v.w.s.c.సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

0
0