Thursday, 5 February 2026
  • Home  
  • అధిక యూరియా వాడకంపై అవగాహన సదస్సు
- E-పేపర్

అధిక యూరియా వాడకంపై అవగాహన సదస్సు

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం నాగులవెల్లటూరు, ఏటూరు గ్రామాలలో అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సదస్సులో మండల వ్యవసాయ అధికారి హిమ బిందు మాట్లాడుతూ అధిక యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లతత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా ఉంటాయని తెలిపారు. నీరు మరియు నేల కాలుష్యం అధికమవుతుందని, పైరు ఏపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు తెగులు మందులు అధిక మోతాదులో వాడవలసి వస్తుందని ఆమె తెలియజేశారు. అంతే కాకుండా వేసిన పంటలను పరిశీలించి అనంతరం రైతులతో మాట్లాడుతూ, భూమి లేని కౌలు రైతులు సిసిఆర్సీ కార్డు పొందడం వలన ప్రభుత్వ పథకాల రాయితీని పొందవచ్చు అని తెలిపారు. అందువలన కౌలు రైతులు అందరూ తప్పనిసరిగా సిసిఆర్సీ కార్డు పొందాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమం లో విఎఎలు శ్రీను, ఇమ్రాన్ ఖాన్ మరియు రైతులు పాల్గొన్నారు.

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి)

చేజర్ల మండలం నాగులవెల్లటూరు, ఏటూరు గ్రామాలలో అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సదస్సులో మండల వ్యవసాయ అధికారి హిమ బిందు మాట్లాడుతూ అధిక యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లతత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా ఉంటాయని తెలిపారు. నీరు మరియు నేల కాలుష్యం అధికమవుతుందని, పైరు ఏపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు తెగులు మందులు అధిక మోతాదులో వాడవలసి వస్తుందని ఆమె తెలియజేశారు. అంతే కాకుండా వేసిన పంటలను పరిశీలించి అనంతరం రైతులతో మాట్లాడుతూ, భూమి లేని కౌలు రైతులు సిసిఆర్సీ కార్డు పొందడం వలన ప్రభుత్వ పథకాల రాయితీని పొందవచ్చు అని తెలిపారు. అందువలన కౌలు రైతులు అందరూ తప్పనిసరిగా సిసిఆర్సీ కార్డు పొందాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమం లో విఎఎలు శ్రీను, ఇమ్రాన్ ఖాన్ మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.