Sunday, 22 March 2026
  • Home  
  • అధిక యూరియా వాడకంపై అవగాహన
- E-పేపర్

అధిక యూరియా వాడకంపై అవగాహన

చేజర్ల సెప్టెంబరు పున్నమి ప్రతినిధి చేజర్ల మండలం చిత్తలూరు, నేర్నూరు గ్రామాలలో అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మండల వ్యవసాయ అధికారి హిమ బిందు మాట్లాడుతూ అధికంగా యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా పోతాయి. నీటి మరియు నేల కాలుష్యం అధికమవుతుంది. పైరు ఎపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు, తెగులు మందులు అధికంగా వాడవలసి వస్తుందని తెలియజేశారు.అంతే కాకుండా వేసిన పంట పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడుతూ భూమి లేని కౌలు రైతులు సిసిఎస్ కార్డు పొందడం వలన ప్రభుత్వ పథకాల రాయితీని పొందవచ్చునని తెలిపారు. అందువలన కౌలు రైతులు తప్పనిసరిగా సిసిఆర్సి కార్డు పొందాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమం లో విఎఎలు నాగభూషణం, ఝాన్సీ మరియు రైతులు పాల్గొన్నారు

చేజర్ల సెప్టెంబరు పున్నమి ప్రతినిధి

చేజర్ల మండలం చిత్తలూరు, నేర్నూరు గ్రామాలలో అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మండల వ్యవసాయ అధికారి హిమ బిందు మాట్లాడుతూ అధికంగా యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా పోతాయి. నీటి మరియు నేల కాలుష్యం అధికమవుతుంది. పైరు ఎపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు, తెగులు మందులు అధికంగా వాడవలసి వస్తుందని తెలియజేశారు.అంతే కాకుండా వేసిన పంట పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడుతూ భూమి లేని కౌలు రైతులు సిసిఎస్ కార్డు పొందడం వలన ప్రభుత్వ పథకాల రాయితీని పొందవచ్చునని తెలిపారు. అందువలన కౌలు రైతులు తప్పనిసరిగా సిసిఆర్సి కార్డు పొందాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమం లో విఎఎలు నాగభూషణం, ఝాన్సీ మరియు రైతులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.