Thursday, 5 February 2026
  • Home  
  • అధికారుల నిర్లక్ష్యం!! దవాఖాన ఆవరణే చెత్త మైదానం
- కామారెడ్డి

అధికారుల నిర్లక్ష్యం!! దవాఖాన ఆవరణే చెత్త మైదానం

కామారెడ్డి, 26డిసెంబర్, పున్నమి ప్రతినిధి : రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో మూలన పడి కుళ్ళిపోతున్న శవ పేటిక సామాన్లు కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో శవపేటిక, ఇనుప గరిటెలు, కార్డ్బోర్డు పెట్టెలు గడ్డి మధ్య పడి ఉన్నాయి.రోగుల కోసం ఉండాల్సిన ఆవరణలోనే చెత్త పేరుకుపోయి, దవాఖాన ప్రతిష్టను, పరిశుభ్ర తను తుడిచిపెట్టేస్తోం ది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలపై మాత్రమే అంబు లెన్స్ సేవరామారెడ్డి మండలానికి 108 అత్యవసర అంబులెన్స్ సేవ అందుబాటులో ఉండాల్సినా, ప్రస్తుతం ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే విధం గా ఆ సదుపాయం కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 108 అంబులెన్సులు 24 గంటలు ఉచితంగా సేవ లు అందించాలన్నే ప్రభుత్వ నిబంధనలు కానీ అత్యవసర సమయంలో డీజిల్ పేరుతో డబ్బులు అడుగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారుల కోసమే అంబులెన్స్… అన్న మండిపాటుదవాఖాన ముందు నిలిపిన అంబులెన్స్ సాధారణ పేద రోగికి అందని ద్రాక్షలా మారి, అధికారులు, ప్రభావశీలుల కోసం మాత్రమే కదులుతుందనే మాటలు మండలంలో వినిపిస్తు న్నాయి. మాకు హార్ట్ ఎటాక్ వస్తే పట్టించుకునే వా రు లేరు,పెద్దలకేం అయితే ఈ అంబులెన్స్ స్టార్ట్ అవుతుంది అని ప్రజలు విరుచుకుపడుతున్నా రు. డ్రైవర్ జీతం లక్షల్లో, సేవ మాత్రం బీటల్లో? తెలంగాణలో అంబులెన్స్ డ్రైవర్లకు నెలకు 15 నుండి 25 వేల వరకు జీతాలు ఇస్తున్న ఉద్యోగ ప్రకటనలు కనిపిస్తున్న పరిస్థితిలో, రామారెడ్డి ప్రజలు తమ మండలంలో మాత్రం ఒక అంబు లెన్సు డ్రైవర్ 35 వేల వరకూ ఖర్చు పెడుతూ నిరు పేదలకు సేవ చేయడం లేదని ఆరోపిస్తున్నా రు.పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్న రూపాయలు, ఆరోగ్య బడ్జెట్ ద్వారా వస్తున్న నిధు లు చివరికి శవపేటికల లా మూలన పడిపోవడం చూస్తుంటే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఓపెన్ ఛాలెంజ్108 అంబులెన్స్ సేవ ఉచితం, ఎవరైనా కాల్ చేసుకునే హక్కు ఉందని చెప్పే ప్రభుత్వ నియమాలు అమలు అవుతున్నాయా లేదా స్వయంగా వెళ్లి చూడాలని జిల్లా మెడికల్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ప్రజల సంఘాలు సవాల్ విసురుతున్నాయి.రా మారెడ్డి సర్విస్ అంబులెన్సు ను విధిగా నూతనం గా ప్రవేశ పెట్టాలి, శవపేటిక సామాన్లు, చెత్త తొల గింపు, అంబులెన్స్ నిజంగా పేదలకు అందుబాటు లోకి వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కామారెడ్డి, 26డిసెంబర్, పున్నమి ప్రతినిధి :

రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో మూలన పడి కుళ్ళిపోతున్న శవ పేటిక సామాన్లు

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో శవపేటిక, ఇనుప గరిటెలు, కార్డ్బోర్డు పెట్టెలు గడ్డి మధ్య పడి ఉన్నాయి.రోగుల కోసం ఉండాల్సిన ఆవరణలోనే చెత్త పేరుకుపోయి, దవాఖాన ప్రతిష్టను, పరిశుభ్ర తను తుడిచిపెట్టేస్తోం ది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలపై మాత్రమే అంబు లెన్స్ సేవరామారెడ్డి మండలానికి 108 అత్యవసర అంబులెన్స్ సేవ అందుబాటులో ఉండాల్సినా, ప్రస్తుతం ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే విధం గా ఆ సదుపాయం కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

108 అంబులెన్సులు 24 గంటలు ఉచితంగా సేవ లు అందించాలన్నే ప్రభుత్వ నిబంధనలు కానీ అత్యవసర సమయంలో డీజిల్ పేరుతో డబ్బులు అడుగుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

అధికారుల కోసమే అంబులెన్స్…

అన్న మండిపాటుదవాఖాన ముందు నిలిపిన అంబులెన్స్ సాధారణ పేద రోగికి అందని ద్రాక్షలా మారి, అధికారులు, ప్రభావశీలుల కోసం మాత్రమే కదులుతుందనే మాటలు మండలంలో వినిపిస్తు న్నాయి. మాకు హార్ట్ ఎటాక్ వస్తే పట్టించుకునే వా రు లేరు,పెద్దలకేం అయితే ఈ అంబులెన్స్ స్టార్ట్ అవుతుంది అని ప్రజలు విరుచుకుపడుతున్నా రు.

డ్రైవర్ జీతం లక్షల్లో, సేవ మాత్రం బీటల్లో?

తెలంగాణలో అంబులెన్స్ డ్రైవర్లకు నెలకు 15 నుండి 25 వేల వరకు జీతాలు ఇస్తున్న ఉద్యోగ ప్రకటనలు కనిపిస్తున్న పరిస్థితిలో, రామారెడ్డి ప్రజలు తమ మండలంలో మాత్రం ఒక అంబు లెన్సు డ్రైవర్ 35 వేల వరకూ ఖర్చు పెడుతూ నిరు పేదలకు సేవ చేయడం లేదని ఆరోపిస్తున్నా రు.పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్న రూపాయలు, ఆరోగ్య బడ్జెట్ ద్వారా వస్తున్న నిధు లు చివరికి శవపేటికల లా మూలన పడిపోవడం చూస్తుంటే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులకు ఓపెన్ ఛాలెంజ్108 అంబులెన్స్ సేవ ఉచితం, ఎవరైనా కాల్ చేసుకునే హక్కు ఉందని చెప్పే ప్రభుత్వ నియమాలు అమలు అవుతున్నాయా లేదా స్వయంగా వెళ్లి చూడాలని జిల్లా మెడికల్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ప్రజల సంఘాలు సవాల్ విసురుతున్నాయి.రా మారెడ్డి సర్విస్ అంబులెన్సు ను విధిగా నూతనం గా ప్రవేశ పెట్టాలి, శవపేటిక సామాన్లు, చెత్త తొల గింపు, అంబులెన్స్ నిజంగా పేదలకు అందుబాటు లోకి వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.