కామారెడ్డి, 01 డిసెంబర్, పున్నమి ప్రతినిధి :
మోడల్ కోడ్ అమల్లో ఉన్నందున, అక్రమ నగదు, ప్రచార సామాగ్రి లేదా అనుమానాస్పద వస్తువులు తరలింపును అడ్డుకోవడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం.రాత్రి సమయంలో ప్రధాన రహదారుల్లో అధికారులు వాహనాలను ఆపి, దాని లోపల ఉన్న వస్తువులను పరిశీలిస్తున్నారు. అధికారుల బృం దం ఒక్కో వాహనాన్ని ఓపెన్ చేసి చూస్తూ, అవసర మైతే యజమానులను ప్రశ్నించటం జరుగుతోంది. ఎవరైనా అధిక మొత్తంలో నగదు లేదా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వస్తువులు తీసుకెళ్తున్న ట్లు కన్పిస్తే, వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.ప్రజలకు సూచనలుఎన్నికల సమయంలో అక్రమంగా నగదు, వస్తువులు తరలించకూడదని అధికారులు సూచిస్తున్నారు.తమ వాహనాల్లో అనుమతినిచ్చినదానికంటే అధిక నగదు లేదా అనుమానాస్పద వస్తువులు ఉంటే, అధికారులకు తెలియజేయాలని సమీప పోలీస్ స్టేషన్ లేదా ఎన్నికల అధికారులతో సంప్రదించాల్సిందిగా తెలిపారు.ఈ తనిఖీలు రామారెడ్డి మండల ప్రజల కు, ఎన్నికల పారదర్శకత సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు


