అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి

అవసరమైతే తప్ప బయట ప్రయాణాలు మానుకోండి ప్రభుత్వ హెచ్చరికలు దృశ్య అందరూ జాగ్రత్తలు పాటించాలి.. ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం : మోంతా తుఫాను వల్ల రానున్న 4 రోజులు పాటు (27,28,29,30) భారీ వర్షాలు బలమైన గాలులు ఏర్పడే అవకాశం ఉన్నందున అధికారులు, నియోజక వర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ప్రభుత్వం వారి హెచ్చరికల దృశ్య అందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలను చేయవద్దని అన్నారు. ఏ విధమైన అత్యవసర పరిస్థితులు ఉన్నాయెడల ఎమ్మెల్యే కార్యాలయం నెంబర్లు 90145 68555, 94410 10095 లకు సంప్రదించవచ్చునని అన్నారు.

