అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)
ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు.
చేజర్ల మండలం ఆదురుపల్లి నుండి నెల్లూరు వెళ్లే దారిలో పడమటి కండ్రిక వద్ద రోడ్డు తీవ్రంగా కుంగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ ప్రమాదకర పరిస్థితి కారణంగా ఇప్పటికే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత మహాసేన పార్టీ వ్యవస్థాపకులు,కార్యకర్తలు అక్కడ తాత్కాలిక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్పందించిన అధికారులు మరుసటి రోజు కంకర తరలించి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు హడావుడి చేశారు. అయితే నెలలు గడిచినా రోడ్డు మరమ్మత్తు పనులు పూర్తికాలేదు. ఈ మార్గంలో ప్రతిరోజూ అధికారులు,నాయకులు ప్రయాణిస్తున్నా సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడితే బాధ్యత అధికారులదేనని వారు తీవ్రంగా మండిపడుతున్నారు. త్వరితగతిన రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


