🌅
అద్భుత యోగా ఘట్టానికి ముస్తాబైన విశాఖ సాగరతీరం
🧘♂️ లక్షలాదిమందితో యోగా ప్రదర్శన | గిన్నీస్ రికార్డు లక్ష్యం
విశాఖపట్నం, జూన్ 20 (పున్నమి న్యూస్):
ఇప్పటి వరకూ ఎన్నడూ చూడనంత విస్తృతంగా — విశాఖ సాగరతీరంపై శనివారం ఉదయం ఓ అద్భుతమైన యోగా ఘట్టం ఆవిష్కృతం కానుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన “యోగాంధ్ర” కార్యక్రమానికి ముగింపు ఘట్టంగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది.
ఈ విశేష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఉదయం 6:30 గంటలకు ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద కార్యక్రమం ప్రారంభం కానుంది.
🔸
గిన్నిస్ రికార్డు లక్ష్యంగా భారీ ఏర్పాట్లు
విశాఖ బీచ్ రోడ్‌లో కాళీమాత ఆలయం నుండి భీమునిపట్టణం వరకు 26 కిలోమీటర్లు అంతటా యోగా ప్రదర్శన నిర్వహించేందుకు 326 compartments ఏర్పాటు చేశారు. ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకాధికారి, 3 ప్రదర్శకులు, 10 వాలంటీర్లు, 1 ఎఎన్ఎం, పోలీస్ అధికారి తదితరులు నియమితులయ్యారు.
- యోగా ప్రదర్శకులు: 1,438 మంది
- యోగా శిక్షకులు: 907 మంది
- మరుగు దొడ్లు: 4,280
- గిన్నిస్ రికార్డు నమోదుకు ప్రతినిధులు: 4,600
- వాహనాలు: 9,995 (7,295 బస్సులు, 2,500 ఆటోలు, 200 మాక్సీ క్యాబ్స్)
- బందోబస్తు: 10,000 మంది పోలీసు సిబ్బంది
- LED స్క్రీన్లు: 335
- Wi-Fi పాయింట్లు: 326
ప్రతి పాల్గొనేవారికి యోగా మేట్, టీషర్ట్ ఇవ్వబడుతుంది. మిగిలిన సదుపాయాల్లో తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, స్టెచర్లు, స్నాక్స్ బాక్సులు సిద్ధంగా ఉంచారు.
🏟️
అదనపు వేదికల్లో యోగా ప్రదర్శనలు
ప్రధాన బీచ్ లైన్తో పాటు, 18 క్రీడా మైదానాలు (ఏయూ మైదానం, ఫోర్ట్ స్టేడియం, కొమ్మాది, పిఎం పాలెం, రైల్వే గ్రౌండ్ తదితరులు) మరియు 30 అదనపు ప్రాంతాల్లో కూడా యోగా ప్రదర్శనలు జరుగుతాయి.
✈️
ప్రధాని పర్యటన షెడ్యూల్
- జూన్ 20 సాయంత్రం విశాఖ చేరుకుంటారు
- జూన్ 21 ఉదయం 6:25కి ప్రధాన వేదికకు చేరుకుంటారు
- 6:30 – 7:45: యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు
ఈ కార్యక్రమానికి కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్, నేవీ, కోస్ట్ గార్డ్, యోగా అసోసియేషన్ల ప్రతినిధులు, అంతర్జాతీయ విద్యార్థులు పాల్గొననున్నారు.