విశాఖ సాగర తీరంలో TU 142 ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన *మాయా వరల్డ్ ను* VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాయా వరల్డ్ ను సందర్శించిన తదుపరి ఆయన మాట్లాడుతూ ఈ మాయా వరల్డ్ దేశంలోనే మొదటిసారిగా విశాఖలో ఏర్పాటు చేయటం అభినదనీయమని పేర్కొన్నారు. వి ఎం ఆర్ డి ఎ ప్రాంగణంలో
మాయా వరల్డ్ నగర వాసులతో పాటు పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ఉందని తెలిపారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన “ఇమాజిన్ రూమ్స్” తరహాలో రూపొందించిన ఈ మ్యూజియం, కళ్లకు కనువిందు చేసే లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతిని కలిగిస్తోందనీ తెలిపారు. మ్యూజియంలో మిరర్ రూమ్స్, స్పేస్ గెలాక్సీ థీమ్, ఫ్లవర్ గార్డెన్ థీమ్, డ్రీమ్ స్కేప్, మెజికల్ ఫారెస్ట్ లాంటి ప్రత్యేక కాన్సెప్ట్‌లతో ఏర్పటు చేసిన గదుల్లో సంచరిస్తే వింత అనుభూతి లభిస్తుందని చెప్పారు. ఫోటోషూట్లకు, రీల్స్ తీయడానికి ఇది సరిగ్గా సరిపోయే ప్రదేశమని చెప్పారు. సెల్ఫీలకు, వీడియోలకు అనువైన ప్రాంతంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కె రమేశ్ , ఈ ఈ దుర్గా ప్రసాద్, డి ఈ మూర్తి, మాయా వరల్డ్ నిర్వాహకులు Capt. NR కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అద్భుతం… మాయా ప్రపంచం బీచ్ రోడ్ లో మాయా వరల్డ్ ను ప్రారంభించిన VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్
విశాఖ సాగర తీరంలో TU 142 ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన *మాయా వరల్డ్ ను* VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాయా వరల్డ్ ను సందర్శించిన తదుపరి ఆయన మాట్లాడుతూ ఈ మాయా వరల్డ్ దేశంలోనే మొదటిసారిగా విశాఖలో ఏర్పాటు చేయటం అభినదనీయమని పేర్కొన్నారు. వి ఎం ఆర్ డి ఎ ప్రాంగణంలో మాయా వరల్డ్ నగర వాసులతో పాటు పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ఉందని తెలిపారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన “ఇమాజిన్ రూమ్స్” తరహాలో రూపొందించిన ఈ మ్యూజియం, కళ్లకు కనువిందు చేసే లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతిని కలిగిస్తోందనీ తెలిపారు. మ్యూజియంలో మిరర్ రూమ్స్, స్పేస్ గెలాక్సీ థీమ్, ఫ్లవర్ గార్డెన్ థీమ్, డ్రీమ్ స్కేప్, మెజికల్ ఫారెస్ట్ లాంటి ప్రత్యేక కాన్సెప్ట్‌లతో ఏర్పటు చేసిన గదుల్లో సంచరిస్తే వింత అనుభూతి లభిస్తుందని చెప్పారు. ఫోటోషూట్లకు, రీల్స్ తీయడానికి ఇది సరిగ్గా సరిపోయే ప్రదేశమని చెప్పారు. సెల్ఫీలకు, వీడియోలకు అనువైన ప్రాంతంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కె రమేశ్ , ఈ ఈ దుర్గా ప్రసాద్, డి ఈ మూర్తి, మాయా వరల్డ్ నిర్వాహకులు Capt. NR కుమార్ తదితరులు పాల్గొన్నారు.

