నాయుడుపేట ఆగస్టు పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్ నాయుడుపేట మండల పరిధిలోని తన్నమాల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున వరి ధాన్యం బస్తాల లోడుతో వెళ్తున్న లారీ రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి పక్కన ఉన్న పొలాల్లో బోల్తా కొట్టింది. లారీ డ్రైవర్ లారీ నీ అక్కడే వదిలి వెళ్ళిపోయాడు . స్థానికుల సమాచారం మేరకు డ్రైవర్ మద్యం తాగి లారీ నడపడం వల్ల ప్రమాదం జరిగింది అని ఎవరికి ఎలాంటి హాని జరగలేదని తెలిపారు.


