Wednesday, 4 March 2026
  • Home  
  • అత్యవసర సమయాల్లో ధైర్యంగా ఉండాలి
- కామారెడ్డి

అత్యవసర సమయాల్లో ధైర్యంగా ఉండాలి

– విద్యార్థులకు అంబులెన్స్ సిబ్బంది అవగాహన కామారెడ్డి, అక్టోబర్ 17:పున్నమి ప్రతినిధి . : అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలను సకాలంలో వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో తెలియజే స్తూ, కామారెడ్డి జిల్లా అంబులెన్స్ శాఖ ఆధ్వర్యం లో రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలోని బాల బాలికల పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ విభాగం సిబ్బంది విద్యార్థులకు ప్రథమ చికిత్స, రోడ్డు భద్రత, సిపిఆర్ పద్ధతులు అత్యవసర సేవ ల వినియోగంపై వివరించారు.సిబ్బంది మాట్లాడు తూ, ప్రమాదం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో 108 నంబర్‌కు వెంటనే కాల్ చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. కాల్ సమయంలో వివరాలు స్పష్టంగా చెప్పడం, భయపడకుండా ధైర్యంగా వ్యవహరించడం ముఖ్యమని విద్యార్థులకు సూచించారు.అంబు లెన్స్ వచ్చేలోపు ప్రథమ చికిత్స పద్ధతులు ఎలా పాటించాలో, చిన్న గాయాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రదర్శన రూపంలో వివరిం చారు.అదేవిధంగా అంబులెన్స్ లోపల ఉండే వైద్య పరికరాలు, వాటి వినియోగ విధానాన్ని ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదా లు జరిగినప్పుడు బాధితులకు తక్షణ సహాయం చేయడం, రోడ్డు భద్రత నియమాలు పాటించడం వంటి అంశాలను కూడా సవివరంగా వివరించా రు.అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా ధైర్యంగా వ్యవహరించి, వెంటనే 108 సేవలను సంప్రదిస్తే ప్రాణాలను రక్షించవచ్చని సూచించారు. ఈ సంద ర్భంగా ఉపాధ్యాయులు కార్యక్రమంపట్ల సంతో షం వ్యక్తం చేస్తూ అంబులెన్స్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ఈ సదస్సు ద్వారా అత్యవసర వైద్య సేవలపై విలువైన అవగాహన పొందామంటూ ఆనందం వ్యక్తం చేశారు.

– విద్యార్థులకు అంబులెన్స్ సిబ్బంది అవగాహన

కామారెడ్డి, అక్టోబర్ 17:పున్నమి ప్రతినిధి . :

అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలను సకాలంలో వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో తెలియజే స్తూ, కామారెడ్డి జిల్లా అంబులెన్స్ శాఖ ఆధ్వర్యం లో రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలోని బాల బాలికల పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ విభాగం సిబ్బంది విద్యార్థులకు ప్రథమ చికిత్స, రోడ్డు భద్రత, సిపిఆర్ పద్ధతులు అత్యవసర సేవ ల వినియోగంపై వివరించారు.సిబ్బంది మాట్లాడు తూ, ప్రమాదం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో 108 నంబర్‌కు వెంటనే కాల్ చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. కాల్ సమయంలో వివరాలు స్పష్టంగా చెప్పడం, భయపడకుండా ధైర్యంగా వ్యవహరించడం ముఖ్యమని విద్యార్థులకు సూచించారు.అంబు లెన్స్ వచ్చేలోపు ప్రథమ చికిత్స పద్ధతులు ఎలా పాటించాలో, చిన్న గాయాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రదర్శన రూపంలో వివరిం చారు.అదేవిధంగా అంబులెన్స్ లోపల ఉండే వైద్య పరికరాలు, వాటి వినియోగ విధానాన్ని ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదా లు జరిగినప్పుడు బాధితులకు తక్షణ సహాయం చేయడం, రోడ్డు భద్రత నియమాలు పాటించడం వంటి అంశాలను కూడా సవివరంగా వివరించా రు.అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా ధైర్యంగా వ్యవహరించి, వెంటనే 108 సేవలను సంప్రదిస్తే ప్రాణాలను రక్షించవచ్చని సూచించారు. ఈ సంద ర్భంగా ఉపాధ్యాయులు కార్యక్రమంపట్ల సంతో షం వ్యక్తం చేస్తూ అంబులెన్స్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ఈ సదస్సు ద్వారా అత్యవసర వైద్య సేవలపై విలువైన అవగాహన పొందామంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.