అమలాపురం, అక్టోబరు 10 (పున్నమి ప్రతినిధి) :
అమలాపురం పట్టణం కల్వకొలను వీధి లో అత్త మెడలో బంగారపు గొలుసు దొంగిలించిన అల్లుడుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి నట్లు పట్టణ ఎస్ ఐ కిషోర్ బాబు తెలిపారు. 7 వ తేది రాత్రి 11 గంటల సమయంలో అమలాపురం పట్టణం కల్వకొలను
వీధిలో నివసించే అడపా ఉమా మహేశ్వరి
మెడలో రెండు కాసుల బంగారపు గొలుసు ను భయపెట్టి బలవంతంగా అల్లుడు అయిన గునిశెట్టి నాగబాబు లాక్కునిపోయాడు. అల్లుడు మీద అత్త ఫిర్యాదు ఇవ్వగా పట్టణ SI NR కిషోర్ బాబు
కేసు నమోదు చేసి
ముద్దాయిని పట్టుకొని అరెస్టు చేసి, అతను దొంగిలించిన బంగారపు గొలుసును రికవరీ చేశారు. అమలాపురం కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించగా, కోత్తపేట సబ్ జైలు కు తరలించి నట్లు ఎస్ ఐ కిషోర్ బాబు తెలిపారు.
అత్త మెడలో గొలుసు కొట్టేసిన అల్లుడు… అరెస్టు, రిమాండ్ కు తరలింపు
అమలాపురం, అక్టోబరు 10 (పున్నమి ప్రతినిధి) : అమలాపురం పట్టణం కల్వకొలను వీధి లో అత్త మెడలో బంగారపు గొలుసు దొంగిలించిన అల్లుడుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి నట్లు పట్టణ ఎస్ ఐ కిషోర్ బాబు తెలిపారు. 7 వ తేది రాత్రి 11 గంటల సమయంలో అమలాపురం పట్టణం కల్వకొలను వీధిలో నివసించే అడపా ఉమా మహేశ్వరి మెడలో రెండు కాసుల బంగారపు గొలుసు ను భయపెట్టి బలవంతంగా అల్లుడు అయిన గునిశెట్టి నాగబాబు లాక్కునిపోయాడు. అల్లుడు మీద అత్త ఫిర్యాదు ఇవ్వగా పట్టణ SI NR కిషోర్ బాబు కేసు నమోదు చేసి ముద్దాయిని పట్టుకొని అరెస్టు చేసి, అతను దొంగిలించిన బంగారపు గొలుసును రికవరీ చేశారు. అమలాపురం కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించగా, కోత్తపేట సబ్ జైలు కు తరలించి నట్లు ఎస్ ఐ కిషోర్ బాబు తెలిపారు.

