Monday, 23 February 2026
  • Home  
  • అడవి పశువులను తరలించి రైతుల పంటలను కాపాడాలి.. మీరు తరలిస్తారా మమ్ములను తరలించుకోమంటారా… నేడు ప్రజా వాణి లో వినతి పత్రం…
- E-పేపర్

అడవి పశువులను తరలించి రైతుల పంటలను కాపాడాలి.. మీరు తరలిస్తారా మమ్ములను తరలించుకోమంటారా… నేడు ప్రజా వాణి లో వినతి పత్రం…

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 23 ఫిబ్రవరి 2026 అడవి పశువులను తరలించి రైతుల పంటలను కాపాడాలి.. మీరు తరలిస్తారా మమ్ములను తరలించుకోమంటారా… నేడు ప్రజా వాణి లో వినతి పత్రం… బండలేమురు గ్రామంలో అడవి పశువులు ఎక్కువై రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్నాయని వాటిని ప్రభుత్వ ఇక్కడ నుండి తరలించాలని కోరుతూ నేడు రంగారెడ్డి జిల్లా ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బండలేమూర్ మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ మాట్లాడుతూ గ్రామం పరిసర ప్రాంతంలో పశువుల బెడద ఎక్కువైందని దీని కారణంగా పది సంవత్సరాలుగా రైతులు పంటలను పందించుకునే పరిస్థితి లేకుండా అయిందని అన్నారు. గ్రామంలోని అనేక మంది రైతులు తమ పంట పొలాల్లో పశువుల బెడదతో పంటలు వేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా పంటలు వేసుకోలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాత్రిపూట పశువుల బెడద నుండి పంటలను కాపాడుకోవడానికి రాత్రనకా పగలనకా కాపు కాసిన రక్షణ లేకుండా పోతుంది. 10 సంవత్సరాలుగా 100 పశువుల దాకా ఉన్నాయని వాటి వలన పంటలు వేసుకోలేకపోతున్నాము. తమ పొలాల్లో పంటలు వేయకుండా బీడులుగా మారి ప్రభుత్వము నుంచి వచ్చే రైతు భరోసా పథకం కూడా వర్తించడం లేదని అన్నారు. రైతు భరోసా అందకపోయినా కనీసం పంట పండించుకొని కూటగడుపుకుందామన్న పరిస్థితి లేకుండా పోయింది. అట్టి పశువులను ఇక్కడి నుండి తరలించాలని పలుమార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. గత పది సంవత్సరాలుగా పంటలను పశువులతోటి కాపాడుకోలేక పోయాము ఇప్పుడు యాసింగులో కొద్దిపాటి వరి నాట్లను వేసుకోవడం జరిగింది. వేసిన కొద్ది రోజుల్లో నే అట్టి వరిచేల ను వెంటనే పశువులు మేసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఇప్పటికైనా అక్కడి పశువులను ఇక్కడినుండి తరలించి గోషాలకా ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వ అధికారులు తరలించని యెడల రైతులు తరలించుకోవడానికి అనుమతి అయినా ఇస్తే వాటిని మేమే తరలిస్తామని అందుకు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బండలేముర్ మాజీ వార్డ్ మెంబర్ జాపాల శంకర్ పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
23 ఫిబ్రవరి 2026
అడవి పశువులను తరలించి రైతుల పంటలను కాపాడాలి..
మీరు తరలిస్తారా మమ్ములను తరలించుకోమంటారా…
నేడు ప్రజా వాణి లో వినతి పత్రం…
బండలేమురు గ్రామంలో అడవి పశువులు ఎక్కువై రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్నాయని వాటిని ప్రభుత్వ ఇక్కడ నుండి తరలించాలని కోరుతూ నేడు రంగారెడ్డి జిల్లా ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా బండలేమూర్ మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ మాట్లాడుతూ గ్రామం పరిసర ప్రాంతంలో పశువుల బెడద ఎక్కువైందని దీని కారణంగా పది సంవత్సరాలుగా రైతులు పంటలను పందించుకునే పరిస్థితి లేకుండా అయిందని అన్నారు. గ్రామంలోని అనేక మంది రైతులు తమ పంట పొలాల్లో పశువుల బెడదతో పంటలు వేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా పంటలు వేసుకోలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాత్రిపూట పశువుల బెడద నుండి పంటలను కాపాడుకోవడానికి రాత్రనకా పగలనకా కాపు కాసిన రక్షణ లేకుండా పోతుంది. 10 సంవత్సరాలుగా 100 పశువుల దాకా ఉన్నాయని వాటి వలన పంటలు వేసుకోలేకపోతున్నాము.
తమ పొలాల్లో పంటలు వేయకుండా బీడులుగా మారి ప్రభుత్వము నుంచి వచ్చే రైతు భరోసా పథకం కూడా వర్తించడం లేదని అన్నారు. రైతు భరోసా అందకపోయినా కనీసం పంట పండించుకొని కూటగడుపుకుందామన్న పరిస్థితి లేకుండా పోయింది. అట్టి పశువులను ఇక్కడి నుండి తరలించాలని పలుమార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
గత పది సంవత్సరాలుగా పంటలను పశువులతోటి కాపాడుకోలేక పోయాము ఇప్పుడు యాసింగులో కొద్దిపాటి వరి నాట్లను వేసుకోవడం జరిగింది. వేసిన కొద్ది రోజుల్లో నే అట్టి వరిచేల ను వెంటనే పశువులు మేసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కావున ఇప్పటికైనా అక్కడి పశువులను ఇక్కడినుండి తరలించి గోషాలకా ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వ అధికారులు తరలించని యెడల రైతులు తరలించుకోవడానికి అనుమతి అయినా ఇస్తే వాటిని మేమే తరలిస్తామని అందుకు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బండలేముర్ మాజీ వార్డ్ మెంబర్ జాపాల శంకర్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.