అడపూరు గ్రామంలో జరుగుతున్న ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన (ఐఏస్) నేడు ప్రత్యక్షంగా సందర్శించారు. కార్యక్రమం ఏర్పాటు,అమలు విధానం, రైతులకు అందిస్తున్న సేవలను ఆమె సమీక్షించారు.రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సబ్ కలెక్టర్ ఈ కార్యక్రమం యొక్క అసలు ఉద్దేశాలను రైతులకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించిన ఐదు ప్రధాన సూత్రాలు అయిన నీటి భద్రత,డిమాండ్ ఆధారిత పంటల సాగు,అగ్రిటెక్ వాడకం,ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్రభుత్వం అందిస్తున్న సహాయం వంటి అంశాలను సవివరంగా రైతులకు తెలియజేశారు. అలాగే రైతులు సాగుచేస్తున్న పంటలు,వాటికి లభించే మద్దతు ధరలు,పంటల ఆధారంగా ప్రభుత్వం అందించే వివిధ ప్రయోజనాలపై చర్చించారు.కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్,మండల వ్యవసాయ అధికారి మల్లికార్జున,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సుబ్బయ్య, సచివాలయ సిబ్బంది మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.

అడపూరులో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని సందర్శించిన రాజంపేట సబ్ కలెక్టర్