
అట్టహాసంగా ఎంపీ ఆదాల జన్మదినోత్సవం దివ్యాంగ బాలలు మంచి జీవితాన్ని పొందాలి అంధుల పాఠశాలకు ఎంపీ ఆదాల లక్ష విరాళం నెల్లూరు, అక్టోబర్ 25 (పున్నమి ప్రతినిధి) : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవం శుక్రవారం ఉదయం ఆయన ఇంట్లో అట్టహాసంగా జరిగింది. ఉదయాన్నే ఆదాల ప్రభాకర్ రెడ్డి వింధ్యావళి దంపతులు వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. పలువురు నేతలు కార్యకర్తలు అభిమానులు ఉదయం నుంచే ఆయన ఇంటికి అభినందించేందుకు బారులు తీరారు. ఏపీ ఆర్ జిందాబాద్ ఏపీ ఆర్ వర్ధిల్లాలి అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. భారీ గజమాలలతో సత్కరించారు డప్పులు మోత మోగాయి. బాణాసంచా శబ్దాలతో ప్రాంతమంతా హోరెత్తింది. పలువురు కార్యకర్తలు, నేతలు శాలువాలతో సత్కరించారు పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత అభిమానుల మధ్య ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ప్రాంతాలకతీతంగా పార్టీలకతీతంగా ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఇంటికి ఇరువైపులా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఆదాల అభిమాని నిజాముద్దీన్ హైదరాబాదు నుంచి భారీ బెలూన్ను తెప్పించి గురువారం రాత్రి ఆయన ఇంటి పైన ఎగరవేశారు తన అభిమానాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించుకున్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులకు కు అల్పాహారం మిఠాయిలు పంపిణీ జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవ ఏర్పాట్లు విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అంధుల పాఠశాలకు ఎంపీ ఆదాల లక్ష విరాళం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం విశ్వభారతి అంధుల పాఠశాలకు లక్ష రూపాయల విరాళం అందించారు సతీమణి వింధ్యావళి సమేతంగా పాల్గొన్నారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విశ్వభారతి అంధుల పాఠశాలలో తన జన్మ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషమని తన అభిమానాన్ని ప్రకటించారు అంధుల పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు నగదుతో పాటు అక్కడ అవసరమైన మరుగుదొడ్లను కూడా కట్టిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఇక్కడి అంధ విద్యార్థు లకు మేలు జరగాలని ఆశిస్తున్న ట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆంధ విద్యార్థులకు పండ్లు పలహారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆదాల సతీమణి వింధ్యావళితో పాటు పాల్గొన్నారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి గిరిధర్రెడ్డి ,కోటేశ్వర్ రెడ్డి , స్వర్ణ వెంకయ్య, సుధాకర్ రెడ్డి, అబూబకర్, ఇక్బాల్, సుధాకర్ యాదవ్, మధు, నరసింహారావు ,నెల్లూరు ఝాన్సీ లక్ష్మి, పాముల హరి తదితరులు పాల్గొన్నారు దివ్యాంగ బాలలు మంచి జీవితాన్ని పొందాలి దివ్యాంగ బాలల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరు రెడ్ క్రాస్ ప్రాంగణంలో జరిగిన మహా రక్తదాన శిబిరం, దివ్యాంగ బాలలకు అన్నదానం, వ్యాయామ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్క్రాస్ ఆధ్వర్యంలో చాలా సంస్థలు సేవాగుణం తో పనిచేస్తున్నాయని ప్రశంసించారు. దివ్యాంగ బాలలు ఇక్కడ లభిస్తున్న శిక్షణతో కోలుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టి , స్వతంత్య్రంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలు జిమ్ వంశి ఆధ్వర్యంలో జరగడం సంతోష దాయకమని పేర్కొన్నారు. రక్తదానం ఉత్తమమైనదని, దీనివల్ల ఎందరో ప్రాణాలను రక్షించ వచ్చునని తెలిపారు . ముఖ్యంగా విష జ్వరాలు ప్రబలి ఉన్న ఈ తరుణంలో రక్తదానానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు తన జన్మదినం సందర్భంగా చాలా మంది యువకులు ముందుకు రావడం సంతోషదాయకం దాయకమని, వారందరికీ అభినందనలు తెలిపారు. రెడ్ క్రాస్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మనోహర్ రెడ్డి అధ్యక్షత వహించారు. జిమ్ వంశీ ఆధ్వర్యంలో దాదాపు 50 మందికి పైగా రక్తదానం చేశారు .ఈ సందర్భంగా వికలాంగ బాలలకు ఆయన తరఫున ఒక వ్యాయామ పరికరాన్ని ఎంపీ చే అందజేశారు. అలాగే స్పాస్టిక్ సెంటర్లో దాదాపు 150 మందికి పైగా ఉన్న బాలలకు అన్నదానం జరిగింది.ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి , అబూబకర్, ఇక్బాల్, పాముల హరి , హరి శివారెడ్డి, డాక్టర్ సుబ్రమణ్యం, నరసింహారావు, ఎస్ గోపి, బాల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు