ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి :
బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అటవీ ఉద్యోగులతో ఘర్షణ..శ్రీశైలం ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

