అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలో భాగంగా
*విశాఖపట్నం డిసెంబర్ 19 పున్నమి ప్రతినిధి*
అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలో భాగంగా విశాఖపట్నంలో పార్క్ హోటల్ సమీపంలో ఏర్పాటు చేయనున్న భారతరత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి విగ్రహావిష్కరణ స్థలాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సురేష్ బాబు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు, పార్టీ నాయకులతో చర్చించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని నాయకులు పేర్కొన్నారు.


