*విజయనగరం డిసెంబర్ 19విశాఖ పున్నమి ప్రతినిధి*
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సభ
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నన్ను ఉఫ రాష్ట్రపతిగా ప్రకటించిన సమయంలో నేను కంటినీరు పెట్టుకున్నాను
మంత్రిగా తొలగించి ఉపరాష్ట్రపతి ఇస్తున్నందుకు బాధ పడుతున్నా అని అందరూ అనుకున్నారు
చిన్నతనంలో నా తల్లి చనిపోయారు.. కష్టంతో రాజకీయాల్లోకి వచ్చాను
బీజేపీ నన్ను తల్లిలా పెంచి పెద్దవాడిని చేసింది.. ఉపరాష్ట్రపతి అయితే.. ఆతర్వాత పార్టీని వీడాలనే ఆలోచన ఆవేదన కలిగించింది
ఆతర్వాత నేను ఏపార్టీ కార్యక్రమాలకు వెళ్లలేదు.. మాధవ్ నేతృత్వంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్రకు రావాలని నన్ను కలిసి కోరారు
నేనే శ్రీకాకుళం, విజయనగరం వంటిప్రాంతాలలో జరిగే సభలకు వస్తా అని చెప్పాను
ఏ నాయకుడు అయినా విశాఖ వరకే వచ్చి మీటింగ్ లు పెడతారు. ఓడిపోతారు.. వెళ్లిపోతారు
విజయనగరం జిల్లా చాలా మంచి జిల్లా.. ఇక్కడ నుంచి చాలా మంది దేశ నేతలుగా ఎదిగారు
ప్రజల్లో ఉంటూ.. ప్రజామోదం కోసం పని చేసే నాయకులు ఉన్నారు
రాజకీయాల్లో పదవుల కోసం పోటీ చేయవచ్చు కానీ.. మచ్చ రాకుండా రాజకీయాలుచేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు
అటువంటి వారిలో అశోకగజపతిరాజు కూడా ముందు వరుసలో ఉంటారు
నేను, ఆయన కలిసి పని చేశాం.. ఎటువంటి మచ్చ లేకుండా ఆయన రాజకీయాలు చేశారు
నేటు అటల్ జీ సుపరిపాలన దినంగా డిసెంబర్ 25న భారీ కార్యక్రమం చేస్తున్నారు
దేశానికి అవసరమైన మంచి పాలన సురిపాలన.. అట్టడుగున ఉండే వ్యక్తికి అవకాశం కల్గించే పాలన సుపరిపాలన
ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా వారి సంక్షేమం గురించి ఆలచన చేయడం
మహిళలపై అత్యాచారు లేకుండా, అరాచకాలు, దౌర్జన్యాలులేకుండా ఉండటం సుపరిపాలన
వేదింపులు లేకుండా ఉండే ప్రభుత్వాన్ని సుపరిపాలన అంటారు
దేశం కోసం సర్వతోముఖాభివృద్ది కోసం పని చేయడాన్నిసుపరిపాలన అంటారు
ఇటువంటి సుపరిపాలనకు వాజ్ పేయ్ శ్రీకారంచుట్టారు
కాంగ్రెస్ యేతర తొలి ప్రధానిగా, విలువతో రాజకీయాలు చేశారు
ఒక్క అవినీతి మచ్చ లేకుండా పాలన సాగించిన ఏకైక నేత వాజ్ పేయ్
ఈ దేశం మొత్తం ఒక్కటే అని భావన కలిగించేలా పాలన సాగించారు
జాతీయ రహదారుల నిర్మాణాలను ప్రవేశ పెట్టిందీ వాజ్ పేయ్
గోల్డెన్ క్వాడిలేటర్లు మనకు పరిచయం చేసిన నేత వాజ్ పేయ్
టెలికం, పోర్టు, పొటిలికల్, హైవేల కనెక్టివీటీలు తెచ్చిన మహనీయుడులు
దేశంలో 32 పార్టీలను ఏకం చేసి.. ఒకతాటిపైకి తెచ్చి దేశాన్ని పాలించారు
ఆయన చూపించిన ఐకమత్యం, పరస్పర విశ్వాసం, ప్రజల కోసం చేసిన మంచిని గుర్తు చేసుకోవాలి
మనం చేసే పని, వేసే అడుగు.. అట్టడుగు వారికి మేలు జరిగేలా ఉండాలి
ప్రజలపై దాడులు, దారుణాలు, అత్యాచారాలు జరగకుండా ఉండటమే సుపరిపాలన అంటారు
ఆయన విగ్రహాలుపెట్టి నమస్కారం పెట్టడం కాదు.. ఆయన చూపిన సుపరిపాలనను మన పదవుల ద్వారా అమలు చేసి చూపాలి
బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు తప్పకుండా వాజ్ పేయ్ గురించి తెలుసుకుని.. ఆ విలువలను ఆచరించాలి
ఈ మూడు పార్టీల నేతలు నేడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు.. సంతోషం అనిపించింది
నేను రాజకీయాల్లో లేను.. నేను వాజ్ పేయ్ తో ఉన్న అనుబంధం కారణంగా వచ్చాను
నేను పదవీ విరమణ చేశాను.. పెదవీ విరమణ చేయలేదు కాబట్టి మాట్లాడుతూనే ఉంటాను
నేను 16వ యేట రాజకీయాల్లోకి వచ్చాను.. పోల్స్ ఎక్కి జెండాలు కట్టేవాడిని
ఆరోజు జట్కా బండి ఎక్కి అభ్యర్దులను గెలిపించాలని ప్రచారం చేసే వాడిని
వాజ్ పేయ్ గురించి గోడల మీద రాసి, మైకుల్లోప్రచారంచేసి, ఆయనకు సహాయకుడిగా ఉన్న వ్యక్తి.. అదే వాజ్ పేయ్, అద్వానీ మధ్య అధ్యక్షుడి హోదాలో కూర్చునే అవకాశం నాకు మాత్రమే వచ్చింది
అదీ బీజేపీ గొప్పతనం.. పని చేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది
అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలకు ముందు క్రమశిక్షణ ఉండాలి, తర్వతా సమయ పాలన పాటించాలి,
ఆలస్యంగానే వస్తేనే గొప్ప అనుకునే నాయుకులు కూుడా మన దగ్గర ఉన్నారు
మన వ్యక్తిగత జీవితంలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా పని తీరు ఉండాలి
అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ అని వేర్వేరుగా చూడటం మానుకోవాలి
రాజకీయ పార్టీ కార్యకర్తలు బెదిరింపులకుపాల్పడ కూడదు, ఆక్రమణలకు పాల్పడకూడదు
అటల్ బీహారీ వాజ్ పాయ్ సాదారణ వ్యక్తి నుంచి ప్రధానిగా అయ్యారు
శ్యాంప్రసాద్ ముఖర్జీతో కలిసి కాశ్మీర్ ఉద్యమంలో వాజ్ పేయ్ పాల్గొన్నారు
ప్రతిపక్ష నేతగా, ప్రధానిగా, బీజేపీకి అఖిలభారత అధ్యక్షుడిగా ఏపదవి చేపట్టినా.. దానికి వన్నె తెచ్చాడు
నేడు ఏపార్టీ నాయకులైనా వాజ్ పేయ్ చూపిన నీతి, నియమాలు, విలువలను పాటించాలి
ఆయన ప్రధాని అయ్యాక మెజారిటీ కి ఒక్క ఓటు తక్కువ అయ్యిందని మేము మాట్లాడుకుంటున్నాం
ఏదొక రకంగా అనేది వద్దు.. నేరుగా మద్దతు ఇస్తే ఓకే..లేదంటే పదవి వదిలేస్తానని వాజ్ పేయ్ చెప్పారు
ఆయన దార్శనికుడు, కవి, సమున్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి
ఆయన కృత్వం, మితృత్వం, తో అందరినీ ఆశ్చర్యపరిచేవారు
బీజేపీని అంచలంచెలుగా నిర్మాణం చేసిన వ్యక్తి వాజ్ పేయ్
సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిన వ్యక్తి వాజ్ పేయ్
ఎకౌంట్ బులిటీని అమలు చేసిన వ్యక్తి వాజ్ పేయ్
నేడు ఉన్న పాలకులు కూడా జనాలకు ఏం చెప్పాం.. ఏం చేస్తున్నామనే ఎకౌంట్ బులిటీ ఉండాలి
ఆఖరి ఫంక్తలో ఉన్న వ్యక్తికి సాయం అందుతుందా లేదా అనేది చూడాలి
డిపీటీ పధకాన్ని మోడీ తీసుకు వచ్చి.. నేరుగా ఎకౌంట్లలో వేస్తున్నారు
గతంలో నిధులు ఇస్తే.. చేతులు మారే లోపు సగం అన్యాక్రాంతం అయ్యేవి
మీకు రావాల్సిన పెన్షన్, స్కాలర్ షిప్, సాయం అన్నీ కూడా ఇప్పుడు మోడీ ఖాతాల్లో వేస్తున్నారు
విశాఖతో నాకు సంబంధం ఉంది.. ఈ ఊర్లో 17 నెలలు జైల్లో ఉన్నాను
చలపతిరావు ఎమ్మెల్సీగా నిలబడితే.. నేను ఆయన విజయానకి కృషి చేశాను
నేను ఇప్పుడు వాకింగ్ చేస్తుంటే.. ఎవరూ వచ్చి డిస్టబ్ చేయరు
అంత చక్కని సంప్రదాయంకలిగిన ఉత్తరాంధ్ర జనాలకు నా అభినందనలు
సర్పంచ్ నుంచి ప్రధాని వరకు ఏ లెవల్ ఉన్న వారైనా చివరి లబ్దిదారుడి వరకు సాయం అందాలి
రాజకీయాల్లో ఉన్న వారు తెల్ల బట్టలు వేసుకున్నంత స్వచ్చందంగా ఉండాలి
ఇసుక, మైనింగ్, వంటివాటిలో ఎమ్మెల్యే కు ఏంటి సంబంధం
మనం ఇల్లు కట్టుకుంటే స్థానిక కార్పోరేటర్ అనుమతి ఎందుకు
నిబంధనల మేరకు నిర్మాణాలు ఉంటే అనుమతి ఇస్తారు
జనం చేత మాట పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి
రాజకీయాల్లో మనకు శత్రువులు ఉండరు.. మన ప్రత్యర్దులు మాత్రమే
మంచి భాషను ఉపయోగించాలే తప్ప… నోటికొచ్చినట్లు దూషించకూడదు
ఈ మధ్య కొంతమంది పచ్చి బూతులు మాట్లాడుతున్నారు.. అటువంటి వారికి బూత్ లలోనే సమాధానం చెప్పాలని మహిళలకు చెప్పా
మొన్న ఎన్నికలలో ఆ బూతులు మాట్లాడే వాడు ఒక్కడు కూడా గెలవలేదు
వారి బూతులు చూసి ప్రజలే అసహ్యించుకుంటున్న పరిస్థితి
వాజ్ పేయ్ ప్రధానిగా,ప్రతిపక్ష నేతగా ప్రత్యర్దులను గౌరవించేవారు కాబట్టే అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు
ఈ మధ్య రాజకీయాలలో కొత్త ఫ్యాషన్.. నీతో పాటు, నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లు, అమ్మలను తిడుతున్నారు
ఇంత దౌర్భగ్యానికి ఎందుకు దిగజారుతున్నారో నాకు అర్దం కావడం లేదు
ఇది ఏమాత్రం మంచిది కాదు.. దీనిని అందరూ మార్చుకోవాలి
వాజ్ పేయ్ కు సహాయకుడిగా ఉన్న నేను.. వారి మధ్యలోకూర్చున్నా అంటే.. పని చేసే వారిని ఎలా పైకి తెస్తారో నేనే ఉదాహరణ
దేశంలో ఎటువంటి కనెక్టివీటిలకు అయినా అద్యుడు వాజ్ పేయ్
నేను గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జాతీయ రహదారులఅభివృద్ది చేశారు
నేను గ్రామాలలో కూుడా రోడ్డులు వేస్తే బాగుంటుందని వాజ్ పేయ్ ను కోరా
ఆర్ధిక మంత్రితో మాట్లాడాలని సూచిస్తే.. నేను వెళ్లి ఆయనకు వివరించా
జాతీయ రహదారులకు టోల్ ఉంటుంది.. గ్రామాలలో టోల్ పెడితే టోల్ తీస్తారని చెప్పారు
నేను మళ్లీ వాజ్ పేయ్, అద్వానీ దగ్గరకు వెళ్లి గ్రామాలలో రోడ్ల గురించి అడిగా
క్యాబినెట్ లో ఈ అంశం చర్చకు పెడతా.. అప్పుడు నీదోరణలో చెప్పు అని వాజ్ పేయ్ సూచించారు
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కు ఆనాడు క్యాబినెట్ లో ఆమెదం లభించింది
రోడ్లు లేకపోతే అధికారి నుంచి ప్రజాప్రతినిధుల వరకు యాక్టర్, డాక్టర్ కూడా రారని చెప్పా
నా రాజకీయ జీవితంలో ఈపధకం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది
ఐదు వేలు జనాభా తర్వతా రెండు వేల జనాభా ఉన్న గ్రామాలకు రోడ్లు వేశాం
ప్రజలకు ఏది అవసరమో.. అత్యంత ప్రాధాన్యమో నేతలు ఆపనులు ముందు చేయాలి
వాజ్ పేయ్ ప్రసంగాలు చాలా అద్బుతంగా ఉండేవి.. ప్రతి కార్యకర్త చక్కగా మాట్లాడే దోరణిని అలవాటు చేసుకోవాలి
రాజకీయాల్లో వ్యక్తిత్వ వైరంపెట్టుకోకూడదు.. వాజ్ పేయ్ ఎప్పుడు అపశబ్దాలకు పాల్పడలేదు
అందుకే ఆయన అందరికీ అజాత శత్రువుగా పేరు గాడించారు
రాజ్యంగం పట్ల అంకిత భావం, అందరినీ కలుపుకుని వెళ్లడం లో వాజ్ పేయ్ ను ఆదర్శంగా తీసుకోవాలి
పార్లమెంట్ లో ఆయన ప్రదర్శిచిన తీరు, విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించడం వాజ్ పేయ్ గొప్పతనం
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని.. గెలుపుకు బాటలు నిర్మించుకోవాలి
ఒక్క ఓటు తో పదవి పోయినా.. హుందాగానే వ్యవహరించారు.. అధికారంకోసం అడ్డదారులు తొక్కకూడదు
విలువలతో రాజకీయాలు చేయాలనేది వాజ్ పేయ్ ను చూసి తెలుసుకోండి
వాజ్ పేయ్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో ఒక అంశంగా చేర్చాలి
నేటి తరం, భవిష్యత్ తరం కూడా వాజ్ పేయ్ జీవిత చరిత్రను తెలుసుకోవాలి
అప్పుడే మంచి రాజకీయ నేతలు సమాజం నుంచి వస్తారు
వాజ్ పేయ్ చూపిన దారిలోనే దేశంలో, రాష్ట్రంలో పాలన సాగుతుంది
2047 కి వికసిత భారత్ సాధనకు ప్రధాని, సీఎంతో అయ్యేది కాదు
ప్రజలంతా వారికి అండగా ఉంటే.. లక్ష్యాలను సాధించవచ్చు
దేశ భక్తి అంటే.. ఎవరి పని వారు చేసుకుంటే.. అదే దేశ భక్తి అని చెప్పాను
నిరక్ష్యరాస్య లేని భారతదేశాన్ని సాధించడం నా కల అని వాజ్ పేయ్ చెప్పారు
వాటిని నిజం చేసేలా మోడీ పాలన సాగుతుంది.. ప్రపంచ దేశాలు మొత్తం మన వైపు చూస్తున్నాయి
ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ మన దేశం గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు.. ఇండియా డెడ్ ఎకానమీ అన్నాడు
ఇంటర్నెషనల్ మానటరీ ఫండ్.. ప్రపంచలో ఆర్ధికంగా ఎదిగే దేశాలలో భారతదేశం టాప్ అని ప్రకటించారు
మన దేశం మంచి కోసం, అభివృద్ది కోసం ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను


