Sunday, 7 December 2025
  • Home  
  • అగ్ర స్థానాన్ని ఆంధ్రా మళ్ళీ సాధిస్తోంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు*
- విశాఖపట్నం

అగ్ర స్థానాన్ని ఆంధ్రా మళ్ళీ సాధిస్తోంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు*

*అగ్ర స్థానాన్ని ఆంధ్రా మళ్ళీ సాధిస్తోంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*: ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల సారథ్యంలో ఆంధ్రా మళ్ళీ దేశంలో అగ్రస్థానం దిశగా దూసుకుపోతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శుక్రవారం నాడు విశాఖపట్నం ఏయూ గ్రౌండ్స్ లో జరుగుతున్న 30వ సిఐఐ పాట్నర్షిప్ సమ్మిట్ లో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ సభలో తనదైన శైలిలో ప్రసంగించారు. గడచిన కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ సరైన విజన్ లేక, మార్గనిర్దేశం లేక వెలవెలబోయిందనీ.. నేడు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మిన్నగా రాష్ట్రం ఎదుగుతూ అగ్ర స్థానాన్ని ఆంధ్రా మళ్ళీ క్లెయిమ్ చేస్తోందని తెలిపారు. చంద్రబాబు అమలు చేసిన విజన్ కారణంగా ఒకప్పుడు సైబరాబాద్ గురించి మాట్లాడుకునేవారని.. ఇప్పుడు అమరావతి, రాయలసీమా, ఉత్తరాంధ్ర.. ఇలా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రా గురించి చర్చించుకుంటున్నారనీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రభుత్వం ఇలా ప్రజలతో మమేకం అవ్వడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల పాత్ర కీలకంగా మారిందని అన్నారు. వికసిత్ భారత్ 2047 తో అపరిమిత అవకాశాలు రానున్నాయని గుర్తు చేసిన రామ్మోహన్ నాయుడు.. ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులకు ఇది సరైన సమయం అని అన్నారు. విమానయానంలో కూడా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద డొమెస్టిక్ వ్యవస్థ గా మన దేశ ఏవియేషన్ రంగం నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం ప్రతీ ఏభై రోజులకు ఒక ఎయిర్ పోర్ట్ చొప్పున ప్రారంభిస్తున్నామని, ఏడు ఎయిర్పోర్ట్ లు ఇప్పటికే రాష్ట్రంలో ఉండగా.. మరో ఏడు అతి త్వరలో సేవలు అందివ్వనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో లాజిస్టింగ్ హబ్, ఏవియేషన్ హబ్ లను ఏర్పాటు చేయడం తో పాటు, 4 ఏవియేషన్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు కూడా రానున్నాయని భవిష్యత్ ప్రణాళికను స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పరిధిలో ఎమ్.ఆర్.ఓ వ్యవస్థ, ఏవియేషన్ స్కిల్లింగ్ యూనివర్సిటీ, డ్రోన్ సెక్టార్, ఏరో సిటీ లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధి విషయంలో చేతుల నిండా పనితో తాము ఉన్నా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఇంకా సంతృప్తి లేదని.. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ తో అభివృద్ధి కావాలని ఆయన అడుగుతూ ఉంటారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఇలాంటి విజనరీ లీడర్షిప్ లో గేట్ వే ఆఫ్ ఇండియా గా ఆంధ్రా మారుతుండగా.. సన్ రైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గా విశాఖపట్నం మారుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కితాబిచ్చారు.

*అగ్ర స్థానాన్ని ఆంధ్రా మళ్ళీ సాధిస్తోంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు*

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*: ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల సారథ్యంలో ఆంధ్రా మళ్ళీ దేశంలో అగ్రస్థానం దిశగా దూసుకుపోతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శుక్రవారం నాడు విశాఖపట్నం ఏయూ గ్రౌండ్స్ లో జరుగుతున్న 30వ సిఐఐ పాట్నర్షిప్ సమ్మిట్ లో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ సభలో తనదైన శైలిలో ప్రసంగించారు.

గడచిన కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ సరైన విజన్ లేక, మార్గనిర్దేశం లేక వెలవెలబోయిందనీ.. నేడు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మిన్నగా రాష్ట్రం ఎదుగుతూ అగ్ర స్థానాన్ని ఆంధ్రా మళ్ళీ క్లెయిమ్ చేస్తోందని తెలిపారు. చంద్రబాబు అమలు చేసిన విజన్ కారణంగా ఒకప్పుడు సైబరాబాద్ గురించి మాట్లాడుకునేవారని.. ఇప్పుడు అమరావతి, రాయలసీమా, ఉత్తరాంధ్ర.. ఇలా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రా గురించి చర్చించుకుంటున్నారనీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రభుత్వం ఇలా ప్రజలతో మమేకం అవ్వడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల పాత్ర కీలకంగా మారిందని అన్నారు.

వికసిత్ భారత్ 2047 తో అపరిమిత అవకాశాలు రానున్నాయని గుర్తు చేసిన రామ్మోహన్ నాయుడు.. ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులకు ఇది సరైన సమయం అని అన్నారు.

విమానయానంలో కూడా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద డొమెస్టిక్ వ్యవస్థ గా మన దేశ ఏవియేషన్ రంగం నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం ప్రతీ ఏభై రోజులకు ఒక ఎయిర్ పోర్ట్ చొప్పున ప్రారంభిస్తున్నామని, ఏడు ఎయిర్పోర్ట్ లు ఇప్పటికే రాష్ట్రంలో ఉండగా.. మరో ఏడు అతి త్వరలో సేవలు అందివ్వనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో లాజిస్టింగ్ హబ్, ఏవియేషన్ హబ్ లను ఏర్పాటు చేయడం తో పాటు, 4 ఏవియేషన్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు కూడా రానున్నాయని భవిష్యత్ ప్రణాళికను స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పరిధిలో ఎమ్.ఆర్.ఓ వ్యవస్థ, ఏవియేషన్ స్కిల్లింగ్ యూనివర్సిటీ, డ్రోన్ సెక్టార్, ఏరో సిటీ లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధి విషయంలో చేతుల నిండా పనితో తాము ఉన్నా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఇంకా సంతృప్తి లేదని.. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ తో అభివృద్ధి కావాలని ఆయన అడుగుతూ ఉంటారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఇలాంటి విజనరీ లీడర్షిప్ లో గేట్ వే ఆఫ్ ఇండియా గా ఆంధ్రా మారుతుండగా.. సన్ రైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గా విశాఖపట్నం మారుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కితాబిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.