పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు తూర్పు గోదావరి జిల్లా: ఎవరు కష్టం లో ఉన్న వెంటనే సహాయం అందించే ఏ యస్.ఓ జోడాల వెంకటేశ్వరావు మిత్ర బృందం,పోలవరం మండలం లోని కార్మల్ పురం గ్రామం లోని అభిమల్ల సత్యనారాయణ గారి ఇల్లు అగ్నిప్రమాదం వలన పూర్తిగా కాలిపోయింది అని సమాచారం తెలుసుకున్న వెంటనే చలించిన హృద యాలతో ట్రస్ట్ సభ్యులు అగ్ని ప్రమాద బాధిత కుటుంబము దగ్గరకు వెళ్లి వారికి బీరువా, ఫోల్డిన్ పరుపు మంచం, సీలింగ్ ఫ్యాన్,26 కేజీ ల బియ్యం బస్తా ఇచ్చారు,ఆర్ధిక సహాయం అందించిన దాతలు మిత్రులు వెంకట్రావు,డాక్టర్అన్నపూర్ణ, వ్యవసాయ సహాయకులు సురేష్, ఏపీఎన్జీవో నాయకుడు కుమార్,రవి శంకర్,రాధాకృష్ణ,రామలక్ష్మి
రామకృష్ణ ,మనిధర్
ఆదిలక్ష్మి,మద్దాలి హనుమంతరావు
హరీష్,రామ్మోహన్
యమున, వారణాశిరవికృష్ణ, వెంకటలక్ష్మిలు ఉన్నారు ఏ.యస్.ఓ జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతు సమాజంలో ఎవరు కష్టం లో ఉన్న తమను సంప్రదిస్తే తక్షణమే సహాయం అందిస్తామని తెలియజేసారు. ఆర్ధిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసారు ఈ కార్యక్రమం లో ఏ.ఎస్.ఓ జోడాల వెంకటేశ్వరావు, దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ టీమ్ సభ్యులు ప్రత్తిపాటి నాగరాజు, సాధనాల కిషోర్, రాంతేజ, డాన్, గౌతమ్ లు పాల్గొన్నారు..
Uploaded Video:


