ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన అగ్నివీర్ జవాన్ అడ్డూరి దుర్గాప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తూ, రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఎసీ కమిటీ సభ్యులు, విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) గురువారం చీపురుపల్లి పట్టణంలో నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొన్నారు.
చీపురుపల్లి నుండి స్వగ్రామమైన మెరకముడిదం మండలం గొల్లలవలస వరకు కొనసాగిన అంతిమయాత్రలో పాల్గొన్న పెదబాబు, దుర్గాప్రసాద్ భౌతికకాయంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తరువాత దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారి దుఃఖంలో తాను భాగస్వామినేనని తెలియజేస్తూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.


