Thursday, 26 March 2026
  • Home  
  • అగనంపూడి జోన్ కి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి
- విశాఖపట్నం

అగనంపూడి జోన్ కి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి

అగనంపూడి జోన్ కి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలి.. జెడ్స్ కి అఖిలపక్ష నాయకులు వినతి అగనంపూడి, జనవరి 29, పున్నమి ప్రతినిధి. అగనంపూడి జోనల్ కమిషనర్ మనిషా త్రిపాఠి ని జీవీఎంసీ 85 వార్డు టిడిపి అధ్యక్షులు కర్రి దశెంద్ర, ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు కలిసి శుక్రవారం జీవీఎంసీ లో జరిగే కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో విలీన గ్రామాలు అత్యధికం గా, జీవీఎంసీలో విస్తరణలో రెండో స్థానంలో ఉన్న అగనంపూడి జోనల్ కి అభివృద్ధి కొరకు ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. డొంకాడ నుండి అమ్మ అపార్ట్మెంట్, పెదమడక శివాలయం నుండి కొండయ్యవలస మరిడిమాంబ వరకు ఉన్న ప్రధాన రోడ్లు విస్తరణ, క్రీడ మైదానం, అగనంపూడి సిగ్నల్స్ నుండి దువ్వాడ రైల్వే స్టేషన్ వరకు డబుల్ రోడ్డు విస్తరణ లైటింగ్ ఏర్పాటు నిమిత్తం, కొండయ్యవలస దానబోయినపాలెం మధ్య బొర్రమాంబ మాంబ గడ్డపై బ్రిడ్జి నిర్మాణం, సూది కొండ దిగుభాగం నివాస ప్రజలకు మంచినీటి కోళాయిలు ఏర్పాటు, జీవీఎంసీ 79, 85 వార్డుల అనుసంధానం గా ఉన్న అగనంపూడి స్మశాన వాటికలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు నిమిత్తం, అసంపూర్తిగా పూర్తిగా ఉన్న సామాజిక భవనాలను నిర్మాణం విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేయాలని వినతి పత్రము అందజేయడం జరిగినది. జెడ్స్ మనిషా త్రిపాటి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన అగనంపూడి జోన్ కు అధికార పూర్వకంగా 8 జోన్ గా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని, అగనంపూడి జోన్ వార్డులు తక్కువైనప్పటికీ విస్తరణ ఎక్కువ అని ఈ జోన్ సిటీ జోన్ లో ఉన్న కంటే అభివృద్ధిలో వెనకబడి ఉండటం వాస్తవంని బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించమని ప్రతిపాదన చేస్తామని అదే విధంగా జీవీఎంసీ కి రెవెన్యూ సమకూర్చడంలో కూడా ప్రజలు సహకరించాలని హౌస్ టాక్స్, వెకెంట్ ల్యాండ్ టాక్స్, ట్రేడ్ టాక్సీలు కూడా నిర్ణీత టైంలో కట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరిసా రామచంద్రరావు, జనసేన పార్టీ నాయకులు బుదిరెడ్డి అప్పారావు, వైఎస్ఆర్సిపి నాయకులు బలిరెడ్డి శ్రీను, ఐఆర్సిహెచ్ అప్పారావు, బిజెపి నాయకులు కుమార్, టిడిపి నాయకులు గంతకోరు స్వరూప్, సిపిఐ నాయకులు సాయిన సన్యాసిరావు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు,

అగనంపూడి జోన్ కి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలి..

జెడ్స్ కి అఖిలపక్ష నాయకులు వినతి

అగనంపూడి, జనవరి 29, పున్నమి ప్రతినిధి.

అగనంపూడి జోనల్ కమిషనర్ మనిషా త్రిపాఠి ని జీవీఎంసీ 85 వార్డు టిడిపి అధ్యక్షులు కర్రి దశెంద్ర, ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు కలిసి శుక్రవారం జీవీఎంసీ లో జరిగే కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో విలీన గ్రామాలు అత్యధికం గా, జీవీఎంసీలో విస్తరణలో రెండో స్థానంలో ఉన్న అగనంపూడి జోనల్ కి అభివృద్ధి కొరకు ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. డొంకాడ నుండి అమ్మ అపార్ట్మెంట్, పెదమడక శివాలయం నుండి కొండయ్యవలస మరిడిమాంబ వరకు ఉన్న ప్రధాన రోడ్లు విస్తరణ, క్రీడ మైదానం, అగనంపూడి సిగ్నల్స్ నుండి దువ్వాడ రైల్వే స్టేషన్ వరకు డబుల్ రోడ్డు విస్తరణ లైటింగ్ ఏర్పాటు నిమిత్తం, కొండయ్యవలస దానబోయినపాలెం మధ్య బొర్రమాంబ మాంబ గడ్డపై బ్రిడ్జి నిర్మాణం, సూది కొండ దిగుభాగం నివాస ప్రజలకు మంచినీటి కోళాయిలు ఏర్పాటు, జీవీఎంసీ 79, 85 వార్డుల అనుసంధానం గా ఉన్న అగనంపూడి స్మశాన వాటికలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు నిమిత్తం, అసంపూర్తిగా పూర్తిగా ఉన్న సామాజిక భవనాలను నిర్మాణం విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేయాలని వినతి పత్రము అందజేయడం జరిగినది. జెడ్స్ మనిషా త్రిపాటి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన అగనంపూడి జోన్ కు అధికార పూర్వకంగా 8 జోన్ గా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని, అగనంపూడి జోన్ వార్డులు తక్కువైనప్పటికీ విస్తరణ ఎక్కువ అని ఈ జోన్ సిటీ జోన్ లో ఉన్న కంటే అభివృద్ధిలో వెనకబడి ఉండటం వాస్తవంని బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించమని ప్రతిపాదన చేస్తామని అదే విధంగా జీవీఎంసీ కి రెవెన్యూ సమకూర్చడంలో కూడా ప్రజలు సహకరించాలని హౌస్ టాక్స్, వెకెంట్ ల్యాండ్ టాక్స్, ట్రేడ్ టాక్సీలు కూడా నిర్ణీత టైంలో కట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరిసా రామచంద్రరావు, జనసేన పార్టీ నాయకులు బుదిరెడ్డి అప్పారావు, వైఎస్ఆర్సిపి నాయకులు బలిరెడ్డి శ్రీను, ఐఆర్సిహెచ్ అప్పారావు, బిజెపి నాయకులు కుమార్, టిడిపి నాయకులు గంతకోరు స్వరూప్, సిపిఐ నాయకులు సాయిన సన్యాసిరావు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.