





నరసన్నపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ నిర్మాణం పై నరసన్నపేట పోలీసులకు బిల్డింగ్స్ సొసైటీ అధ్యక్షులు చింతు రామారావు ఫిర్యాదు చేశారు. బిల్డింగ్ సొసైటీ నియమాలకు అతీతంగా నిర్మాణాలు చేపడుతున్నారని, గ్రామపంచాయతీ బిల్డింగ్స్ సొసైటీ ఎన్ఓసి లేకుండా గృహేతర ఉపయోగాలకు నిర్మాణాలకు ఒప్పందం చేసుకోవడం బిల్డింగ్ సొసైటీ నియమాలు ఉల్లంఘిస్తూ చేపడుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలని నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరము జిల్లా గ్రీవెన్స్ ఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలియజేశారు. గ్రామపంచాయతీ ఈవోకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని, రెవెన్యూ అధికారులకు కూడా అనుమతులైన నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినట్లు ఆయన తెలియజేశారు.
నరసన్నపేట నడిబొడ్డున కడుతున్న ఈ అక్రమ కట్టడానికి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జోరుగా సాగుతున్న మేజర్ పంచాయితీ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుల పేర్కొన్నారు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

