Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Dr. B.R. Ambedkar Konaseema

అక్టోబర్ 17 వరకు నెలరోజులపాటు స్వచ్ఛత హి సేవ 2026 కార్యక్రమాలు   డ

Punnami Newsroom Published: Updated:
అక్టోబర్ 17 వరకు నెలరోజులపాటు స్వచ్ఛత హి సేవ 2026 కార్యక్రమాలు   డ

Story highlights

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశముల ప్రకారం ప్రతీ రోజు నిర్వహించే స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా నేటి నుండి సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వ తేది వరకు నెలరోజుల పాటు జరుగుతాయని కమిషనర్…
  • ఈ కార్యక్రమాల్లో భాగంగా నగర పంచాయతి కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో స్వచ్ఛత హీ సేవా – 2026 స్వచ్ఛతే మన సంకల్పం, పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత, స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల వేర్పాటు మరియు పర్యావరణ పరిరక్షణపై విలువైన సలహాలు, సూచనలు అందించారు.
  • ప్రజలు మీ ఇంటి నుంచే స్వచ్ఛతపై అవగాహన పెంపొందించుకుని, తమ ఇళ్లలోనూ, పరిసరాల్లోనూ తడి, పొడి మరియు ఇతర వ్యర్థాలను సరైన విధంగా వేరు చేసి అందించడం ద్వారా స్వచ్ఛమైన ముమ్మిడివరం నగర పంచాయతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతి ఆధ్వర్యంలో  ప్రభుత్వ  ఆదేశముల  ప్రకారం  ప్రతీ  రోజు నిర్వహించే  స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా నేటి నుండి సెప్టెంబర్ 17 నుండి  అక్టోబర్ 17 వ తేది వరకు నెలరోజుల పాటు జరుగుతాయని కమిషనర్ పి రవివర్మ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా నగర పంచాయతి కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో  స్వచ్ఛత హీ సేవా – 2026 స్వచ్ఛతే మన సంకల్పం, పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత, స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల వేర్పాటు మరియు పర్యావరణ పరిరక్షణపై విలువైన సలహాలు, సూచనలు అందించారు. ప్రజలు మీ ఇంటి నుంచే స్వచ్ఛతపై అవగాహన పెంపొందించుకుని, తమ ఇళ్లలోనూ, పరిసరాల్లోనూ తడి, పొడి మరియు ఇతర వ్యర్థాలను సరైన విధంగా వేరు చేసి అందించడం ద్వారా స్వచ్ఛమైన ముమ్మిడివరం నగర పంచాయతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు సరిపెల్ల శ్రీను రాజు , వ్యవసాయ అధికారి ఎస్.ప్రశాంతకుమార్, మేనేజర్ కె.వదన్,  శానిటరీ ఇన్స్పెక్టర్ ఇంచార్జి రాజీవ్  , ఆర్.ఐ. భాస్కరరావు, సి.ఎం.ఎం. భాస్కర్, మరియు శానిటేషన్ సెక్రెటరీలు,హెల్త్ సెక్రటరీలు ,  సి.ఓ.దేవకిలక్ష్మి ,ఆర్.పి.లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *