పత్తి చేనులోనే పత్తి తడిసి ముద్దవుతుండగా., పంటకు ఈసారి దిగుబడి ఇక అతి కష్టమేనని పత్తి రైతులు దిగులు చెందుతున్నారు. ఈ క్రమం లోనే ఇప్పటికే తీసిన పత్తిని మంగళవారం ఉదయం కొందరు రైతులు వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు తీసుకు రాగా, వర్షంలోనే పత్తి బస్తాలు, మ క్కలు తడిసిపోయాయి.
ఇందుకు సంబంధించిన దృశ్యాలను చూసి.. రైతులు కలవర పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి.. ఎక్కువ ధరలకు కూలీలను తీసుకువచ్చి మరి.. పత్తినీ చేనులో నుంచి అతి కష్టం మీద తీసుకొచ్చి కొనుగోలుకు వెళ్లగా వరుణ దేవుడు ఈ విధంగా చేయడం తమ గుండెల్లో గాయాలను మిగిలి పోయేలా చేస్తుందని వాపోతున్నారు.
మార్కెట్ కి తీసుకొచ్చిన పత్తి బస్తాల వద్ద వరదలు రావడం చూసి.. తమ హృదయాలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నాయని కొందరు రైతులు పేర్కొన్నారు.
వరుణ దేవుడా ఇకనైనా కనికరించు కొంతకాలం పాటు వర్షాలను పడకుండా చూడు… మాపై దయ చూపు అని కొందరు రైతులు వేడుకుంటున్నారు.


