అంబేద్కర్ ని అవమానించిన వారికి ఉరిశిక్ష విధించాలి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చడం రాజ్యాంగాన్ని కాల్చడమే
*అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్.
కొవ్వూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు.
రాజమహేంద్రవరం :అక్టోబర్ 09,అఖండ భూమి:
గత గురువారం రాత్రి చిత్తూరు జిల్లా దేవళం పేట గ్రామంలో వైయస్సార్ సిపి కి చెందిన దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి. ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి కాల్చివేసిన సంఘటన చోటు చేసుకోవడం శోచనీయం, అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి భారీ ఎత్తున టిడిపి శ్రేణులు ఎస్సీ సెల్ విభాగం వారు రాజమండ్రి పుష్కరాల రేవు నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాలలతో ఆయన్ని సత్కరించమన్నారు,
అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
చిత్తూరు జిల్లాలో దేవళంపేటలో దుండగులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించి ప్రజాస్వామ్యానికి మచ్చను మిగిల్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అంబేద్కర్ సిద్ధాంతాల పరిరక్షణలో ఎల్లప్పుడూ ముందుండే తెలుగుదేశం పార్టీ,
సమాజంలో శాంతి, సామరస్యాన్ని భంగం చేసే ఇటువంటి చర్యలను ఎంతమాత్రం సహించదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల ఆత్మగౌరవాన్ని వీధిపాలు చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలతో జాతి సమైక్యతను దెబ్బతీస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. దళితుల హక్కుల కోసం పోరాడిన రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ను అవమానించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. నిందితులను మాత్రమే కాదు వారి వెనక ఉన్న సూత్రధారులను కూడా అరెస్టు చేసి శిక్షించాలన్నారు. దేశ పటిష్టతకు బలమైన రాజ్యాంగం అందించి, దళితుల హక్కుల కై పోరాడిన నాయకుడిగా దేశ ప్రజల మనసులను గెలిచిన అంబేద్కర్ గొప్పతనాన్ని చిల్లర పనులతో చెరపలేరన్నారు
నా ఎస్సీలు నా ఎస్టీలు అన్న జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా కూడా దళిత వ్యతిరేకి , డాక్టర్ సుధాకర్ ని చంపిన దళిత బిడ్డని సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ డెలివరీ చేసిన సంఘటన, చంద్రబాబు నాయుడు దళితులకు ఇచ్చినటువంటి 27 రకాల స్కీములు కూడా రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి దళితులకు వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంబేద్కర్ కు జరిగిన అవమానం దళిత జాతికే అవమాన పరిచినట్టు అని మేము భావిస్తున్నాం, విగ్రహం కూల్చిన వారి మీద దేశద్రోహం కేసు పెట్టాలి అరెస్టు చేయాలి, గడిచిన ఐదు సంవత్సరాలలో అంబేద్కర్ రాజ్యాంగం కాక పులివెందుల రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలకు ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అంబేద్కర్ అవమానపరిచిన వారిని ఉరిశిక్ష వేయాలని ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమా కుమార్ మరియు కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ముప్పిడి వెంకటేశ్వరరావు టిడిపి కార్యకర్తలు ఎస్సీ సెల్ విభాగం, టిడిపి మహిళా విభాగం కూటమి నాయకులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.


