అమరావతి నవంబర్ విశాఖ పున్నమి ప్రతినిధి:-
*అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి*
*42 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ ప్రభుత్వ బాలికల అంధుల రెసిడెన్షియల్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కరుణ కుమారి*
*మ్యాచ్ లో కరుణ కుమారి చూపిన ప్రతిభ రాష్ట్రానికే గర్వకారణం*
*కరుణ కుమారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు*
*మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి*
*అమరావతి,దివ్యదర్శిని న్యూస్*
అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపుపై రాష్ట్ర దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ…..
ఫైనల్‌లో నేపాల్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు. జట్టు సభ్యుల సమిష్టి కృషి, అకుంఠిత దీక్ష, పట్టుదలతో విజయం సాధించారు.ఈ మ్యాచ్ లో 42 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖలోని ప్రభుత్వ బాలికల అంధుల రెసిడెన్షియల్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని పంగి కరుణ కుమారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు. కరుణ కుమారికి సహకరించిన పాఠశాల సిబ్బందికి అభినందనలు. కరుణ కుమారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రికెట్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి అన్ని విధాల ప్రోత్సహించాం. ఈ మ్యాచ్ లో కరుణకుమారి చూపిన ప్రతిభ రాష్ట్రానికే గర్వకారణం. విభిన్న ప్రతిభావంతుల ప్రతిభను గుర్తించి వారికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందనేదానికి ఇదే నిదర్శమని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.


