అడ్వకేట్ చెన్నా ప్రమోధిని
విశాఖపట్నం సెప్టెంబర్ 10
పున్నమి ప్రతినిధి సూర్యనారాయణ


విశాఖ సిటీ: ప్రస్తుత సమాజంలో మోసాలకు గురికాకుండా ఉండాలంటే చట్టాలపై అవగాహన అందరికీ అవసరమని అడ్వకేట్ చెన్నా ప్రమోధిని స్పష్టంచేశారు. విద్యార్ధులను ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు యారాడలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ నట్టి అప్పారావు, ఉపాధ్యాయుల ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి లాయర్ చెన్నా ప్రమోధిని అతిథిగా పాల్గొని విద్యార్ధులను ఉద్దేశించి పలు అంశాలపై ప్రసంగించారు. ముఖ్యంగా పోక్సో చట్టం, న్యాయ విద్య గొప్పతనం, విద్యాహక్కు చట్టం, బాల కార్మికుల చట్టాలు, బాల నేరస్తుల చట్టాలు తదితర అంశాలపై విద్యార్దులకు అవగాహన కల్పించారు. లాయర్ కావాలనే కోరిక ఉన్న విద్యార్ధులు తనను సంప్రదిస్తే కొన్ని సులభమైన మెలుకువలు నేర్పుతానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కార్యక్రమంలో విద్యార్ధులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ నట్టి అప్పారావు మాష్టారు, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విశ్వనాథ్, ఎస్ఎం చైర్ పర్సన్ రెడ్డి మంగ, బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత సుజాత, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది లాయర్ చెన్నా ప్రమోధినిను, బెస్ట్ టీచర్ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

