Tuesday, 24 March 2026
  • Home  
  • అంతర్జాతీయ వాకర్స్ సేవలు ప్రపంచానికే ఆదర్శనీయం! నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంక భ్రత బాగ్చి
- విశాఖపట్నం

అంతర్జాతీయ వాకర్స్ సేవలు ప్రపంచానికే ఆదర్శనీయం! నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంక భ్రత బాగ్చి

అంతర్జాతీయ వాకర్స్ సేవలు ప్రపంచానికే ఆదర్శనీయం నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంక భ్రత బాగ్చి ఘనంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సదస్సులో … దేశ విదేశాల నుండీ పాల్గొన్న 1650 వాకర్స్ క్లబ్స్ అధినేతలు, ప్రతినిధులు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, సామాజిక సేవాచైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న వాకర్స్ ప్రపంచానికే ఆదర్శనీయమని నగర పోలీస్ కమీషనర్ డాక్టర్. శంక భ్రత బాగ్చి కొనియాడారు. సిరిపురంలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనా పార్క్ లో శనివారం నాడు ’34వ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగిస్తూ దైనందిన జీవనంలో నడకను వ్యాయామంగా మార్చుకోవడం ద్వారా రక్త ప్రశరణలో వేగం పెరిగి గుండెకు సంబంధిత ప్రాణాంతక వ్యాధుల నుండీ ఉపశమనం లభిస్తుందన్నారు. సైబర్ క్రైమ్ పై అవగాహన ఈ సదస్సులో డా. బాగ్చి “సైబర్ క్రైమ్” పై అవగాహన కల్పిస్తూ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ సైబర్ క్రైం బాదితులే నని, విదేశాలలో ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి, మన యువతకు డబ్బు ఆశచూపి వారిని ఈ బ్లాక్ మెయిల్ చేస్తూ దాదాపు మూడు వందల కోట్లు దోచేశారన్నారు.సైబర్ నేరగాళ్ల నుండీ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే భయపడకుండా నేరుగా తననే సంప్రదించవవచ్చునన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ డా. కమల్ బయిద్ ఆధ్వర్యంలో అధ్యక్షులు కె. ప్రభావతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పూర్వ అధ్యక్షులు ఎస్. పి. రవీంద్ర మాట్లాడుతూ ప్రతీ వాకర్ ఓ సైనికుడే నన్నారు. *”నడవండి – నడిపించండి”* నినాదంతో తన తండ్రి స్వర్గీయ సుంకర ఆళ్వార్ దాస్ 1986 సం.లో విశాఖపట్నంలో స్థాపించిన ‘వాకర్స్ ఇంటర్నేషనల్’ నేడు దేశ, విదేశాలలో మూడు లక్షలకు పైగా సభ్యులతో, 1650 శాఖలుగా విస్తరించిడం ఆనందనీయమన్నారు. ఈ సదస్సులో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె. ద్వారాకానాధ్, వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మీడియా కన్వీనర్స్ నండూరి రామకృష్ణ, సి హెచ్. శ్రీనివాసరాజు, డాక్టర్ డి డి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ వాకర్స్ సేవలు ప్రపంచానికే ఆదర్శనీయం

నగర పోలీస్ కమీషనర్
డాక్టర్ శంక భ్రత బాగ్చి

ఘనంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సదస్సులో …

దేశ విదేశాల నుండీ పాల్గొన్న 1650 వాకర్స్ క్లబ్స్ అధినేతలు, ప్రతినిధులు.

వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, సామాజిక సేవాచైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న వాకర్స్ ప్రపంచానికే ఆదర్శనీయమని నగర పోలీస్ కమీషనర్ డాక్టర్. శంక భ్రత బాగ్చి కొనియాడారు. సిరిపురంలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనా పార్క్ లో శనివారం నాడు ’34వ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగిస్తూ దైనందిన జీవనంలో
నడకను వ్యాయామంగా మార్చుకోవడం ద్వారా రక్త ప్రశరణలో వేగం పెరిగి గుండెకు సంబంధిత ప్రాణాంతక వ్యాధుల నుండీ ఉపశమనం
లభిస్తుందన్నారు.

సైబర్ క్రైమ్ పై అవగాహన

ఈ సదస్సులో డా. బాగ్చి “సైబర్ క్రైమ్” పై అవగాహన కల్పిస్తూ
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ
సైబర్ క్రైం బాదితులే నని, విదేశాలలో ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి, మన యువతకు డబ్బు ఆశచూపి వారిని ఈ బ్లాక్ మెయిల్ చేస్తూ
దాదాపు మూడు వందల కోట్లు
దోచేశారన్నారు.సైబర్ నేరగాళ్ల
నుండీ అప్రమత్తంగా ఉండాలని,
వెంటనే భయపడకుండా నేరుగా తననే సంప్రదించవవచ్చునన్నారు.
వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ డా. కమల్ బయిద్ ఆధ్వర్యంలో అధ్యక్షులు కె. ప్రభావతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పూర్వ అధ్యక్షులు
ఎస్. పి. రవీంద్ర మాట్లాడుతూ
ప్రతీ వాకర్ ఓ సైనికుడే నన్నారు.
*”నడవండి – నడిపించండి”* నినాదంతో తన తండ్రి స్వర్గీయ సుంకర ఆళ్వార్ దాస్ 1986 సం.లో విశాఖపట్నంలో స్థాపించిన ‘వాకర్స్ ఇంటర్నేషనల్’ నేడు దేశ, విదేశాలలో మూడు లక్షలకు పైగా సభ్యులతో, 1650 శాఖలుగా విస్తరించిడం ఆనందనీయమన్నారు. ఈ సదస్సులో వాకర్స్ ఇంటర్నేషనల్
డిస్ట్రిక్ట్ గవర్నర్ కె. ద్వారాకానాధ్,
వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మీడియా కన్వీనర్స్ నండూరి రామకృష్ణ, సి హెచ్. శ్రీనివాసరాజు,
డాక్టర్ డి డి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.