అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఆన్ లైన్ వేబినార్ ద్వారా ఇంటి వద్దదే కుంటుంబం తో యోగ అనే కార్యక్రమం✍️

    0
    344

    పున్నమి తెలుగు దిన పత్రిక ✍️✍️
    విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం
    అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భముగా విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఇంటివద్ద యోగా , కుటుంబం తో యోగా అనే అంశంపై ఆన్ లైన్ వెబినార్ ను నిర్వహించారు. 

    ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శనరావు గారు ముఖ్యఅతిధిగా పాల్గొని వెబినార్ ను ప్రారంభించారు. యోగ మరియు ఆయుర్వేదం అనే రెండు ముఖ్యమైన అంశాలు మన దేశ సాంప్రదాయకంగా ఎంతో ప్రాముఖ్యమైనవి అని అన్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తం యోగాను దైనందిన జీవితంలో ఒక భాగం గా అలవాటు చేసుకున్నారని అన్నారు. ప్రస్తుతం నెల కొని వున్న పరిస్థితులలో మన సంప్రదాయ పద్ధతులు అయిన యోగ అలాగే ఆయుర్వేదమును అందరు ఆచరించాలని కోరారు. మినిస్ట్రీ అఫ్ ఆయుష్ వారు యోగ మరియు ఆయుర్వేదమును శాస్త్రీయ పద్దతిలో వాటి ప్రాముఖ్యతను తెలియచేయటానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం నెలకొనివున్న కోవిద్-19 విపత్కర పరిస్థితులలో ఇలా ఆన్ లైన్ లో కలుసుకోవలసి వచ్చిందని, ఇది ఒకరకంగా బాధాకరమైన అంశమైనా, ఇప్పుడు అందరు నూతనముగా ఆవిర్భవిస్తున్న టెక్నాలజీ ను వినియోగించుకొని సరికొత్త పద్దతిలో కాన్ఫెరెన్సెస్ మరియు వర్కుషాప్స్ నిర్వహించగలుగుతున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరము నుంచి విశ్వవిద్యాలయం యోగ మీద ఒక ప్రత్యేకమైన 3 నెలల సర్టిఫిఫికేట్ కోర్స్ ను ప్రారంబించామని అన్నారు. లాక్ డౌన్ సమయం లో VSU NSS సెల్ వారు చేసిన సేవలను అయన కొనియాడారు. తదనంతరం రాష్ట్ర NSS అధికారి డా. కె. రమేష్ రెడ్డి గారు యోగ యొక్క ప్రాముఖ్యతను విపులంగా వివరించారు. తదనంతరం స్థానిక సర్టిఫైడ్ యోగ ప్రక్షనేర్ శ్రీమతి స్వప్న గారి అంతర్జాతీయ యోగ దిన ప్రోటోకాల్లో వున్న వివిధ రకాల యోగాఆసనాలను ఆన్లైన్లో చేసిచూపించారు. అలాగే నేచర్ థెరపిస్ట్ శ్రీ ఎం వి. ప్రసన్న కుమార్ గారు కోవిద్-19 నిరోదించటంలో నేచురోపతి మరియు యోగ యొక్క ప్రాముఖ్యతను అర్థవంతంగా అందరికి తెలియ పరచారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు మరియు రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి గారు యోగ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ వెబినార్ కు NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం నిర్వాకునిగా , NSS ప్రోగ్రాం అధికారి డా. వై. విజయ, మోడరేటర్ గా మరియు NSS ప్రోగ్రాం అధికారి డా. సుశీల, ముగింపు కార్యక్రమాన్నీ సమన్వయము చేశారు. ఈ వెబినార్ లో విశ్వవిద్యాలయానికి సంబందించిన NSS ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు పిన్సిపల్స్ మరియు NSS వాలంటీర్లు మరియు విద్యార్థులు సుమారు 200ల మంది పాల్గొన్నారు.

     

    0
    0