🧘 అంతర్జాతీయ యోగా దినోత్సవం – ఇబ్రహీం నగర్ పాఠశాలలో వైభవంగా
ఇబ్రహీం నగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు యోగాసనాలు, ప్రాణాయామాలు, మరియు ధ్యానాన్ని ప్రదర్శిస్తూ యోగ ప్రాముఖ్యతను ప్రాక్టికల్‌గా అర్థం చేసుకున్నారు.
ప్రధానోపాధ్యాయులు శ్రీ కోళ్ల నరసింహులు గారు యోగ సాధన వల్ల మెదడు చురుకుదనం, శారీరక, మానసిక ఆరోగ్యం ఎలా మెరుగవుతాయో విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు యోగా ఎంత ముఖ్యమో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి టి.లక్ష్మి గారు (అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్), పలువురు తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
సంస్థ తరఫున పాఠశాల విద్యార్థులలో ఆరోగ్యపరమైన చైతన్యం పెంచే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
పాఠశాల పరిధిలో ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.