రాజన్న సిరిసిల్ల జిల్లా /మార్చి/ పున్నమి ప్రతినిధి
ఈరోజు (08-03-2026) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట లేబర్ అడ్డా వద్ద బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రమజీవి మహిళలను శాలువాలతో సత్కరించారు. బంక లలిత, రాంబాయి, నరసవ్వ, లత తదితర మహిళలకు ఈ సందర్భంగా సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి, గౌరవ అధ్యక్షుడు మిట్టపల్లి రాజమల్లు, ప్రధాన కార్యదర్శి ఎగమాటి ఎల్లారెడ్డి, జిల్లా నాయకులు ము.సం. రమేష్, ఈశంపల్లి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లేబర్ అడ్డా వద్ద మహిళా కార్మికులకు మూత్రశాల, మంచినీటి వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే లేబర్ కార్డుల సమస్యలు, బ్రోకర్ల దందాలు నివారించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13-03-2026న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికుల ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.


