రాజన్న సిరిసిల్ల జిల్లా మార్చి పున్నమి ప్రతినిధి
అంతరించిపోతున్న కుల చేతివృత్తులతో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో బీసీ వర్గాల జీవన పరిస్థితులు దెబ్బతింటున్నాయని, వారి బ్రతుకుల బాగుకోసం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేయాలని మెంగని మనోహర్ డిమాండ్ చేశారు.
బీసీ సాధికారిక సంఘం స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మెంగని మనోహర్ మాట్లాడుతూ, బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా సంప్రదాయ కుల చేతివృత్తులు క్రమంగా అంతరించిపోతున్న పరిస్థితుల్లో ఆ వృత్తులను కాపాడేందుకు మరియు బీసీలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పథకాలు తీసుకురావాలని సూచించారు.
అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయన అన్నారు. ఆ హామీలను అమలు చేయడానికి రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
బీసీలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారి అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని మెంగని మనోహర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


