Thursday, 5 March 2026
  • Home  
  • *అంగరంగ వైభవంగా శ్రీవిజయగణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవం*
- తిరుపతి

*అంగరంగ వైభవంగా శ్రీవిజయగణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవం*

పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు,హిందూ సంఘాల ప్రతినిధులు స్థానికులు* తిరుపతి రూరల్,మార్చి 5 పున్నమి ప్రతినిధి. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరులో నేతాజీ నగర్ లో MRR ట్రస్టు ఆధ్వర్యంలో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధు స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు,హోమాలతో కుంభాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిపించారు.నేతాజీ నగర్ వాసులు,హిందూ సంఘాల ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొనగా వారికి ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి, ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి వచ్చిన అతిధుల అందరికీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు,ప్రత్యేక తయారుచేసిన ప్రసాదాలు, పంపిణీ చేశారు.అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా MRR ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి, ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి మాట్లాడుతూ శ్రీ విజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవం దిగ్విజయం జరిగింది.ఈ కుంభాభిషేక మహోత్సవానికి అన్ని రకాలుగా సహకరించిన, స్వామి కైంకర్యానికి వివిధ రూపాలుగా సమర్పించిన స్థానికులు,మిత్రులు,భక్తులు,ప్రజలకు ప్రతీ ఒక్కరికీ ఆ విజయ గణపతి స్వామి ఆశీస్సులు,అనుగ్రహం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.అదే విధంగా స్వామి వారి సేవ చేసుకునే భాగ్యం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలుపుతూ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు,హిందూ సంఘాల ప్రతినిధులు స్థానికులు*

తిరుపతి రూరల్,మార్చి 5 పున్నమి ప్రతినిధి.

శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరులో నేతాజీ నగర్ లో MRR ట్రస్టు ఆధ్వర్యంలో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధు స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు,హోమాలతో కుంభాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిపించారు.నేతాజీ నగర్ వాసులు,హిందూ సంఘాల ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొనగా వారికి ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి, ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి వచ్చిన అతిధుల అందరికీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు,ప్రత్యేక తయారుచేసిన ప్రసాదాలు, పంపిణీ చేశారు.అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా MRR ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి, ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి మాట్లాడుతూ శ్రీ విజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవం దిగ్విజయం జరిగింది.ఈ కుంభాభిషేక మహోత్సవానికి అన్ని రకాలుగా సహకరించిన, స్వామి కైంకర్యానికి వివిధ రూపాలుగా సమర్పించిన స్థానికులు,మిత్రులు,భక్తులు,ప్రజలకు ప్రతీ ఒక్కరికీ ఆ విజయ గణపతి స్వామి ఆశీస్సులు,అనుగ్రహం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.అదే విధంగా స్వామి వారి సేవ చేసుకునే భాగ్యం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలుపుతూ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.