Thursday, 5 February 2026
  • Home  
  • అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముందస్తు పుట్టిన రోజు వేడుకలు.
- తూర్పు గోదావరి

అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముందస్తు పుట్టిన రోజు వేడుకలు.

– యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప్రదీప్ ఆధ్వర్యంలో… – 2వేల మందికి 5 కిలోల వంతున బియ్యం బ్యాగులు పంపిణి – భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే. ఆదిరెడ్డి శ్రీనివాస్ – ఈవీఎం ఎమ్మెల్యే కాదు ఎవ్రీ టైమ్ రాజమండ్రిసిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు: డాక్టర్ యాళ్ళ ప్రదీప్ – మరో 20 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది… ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా ఉంటారు : నాయకులు రాజమహేద్రవరం : రాష్ట్రంలో ఏగాలి వీచినా రాజమండ్రిలో టీడీపీ జెండా ఎగరవేస్తున్న, మహిళలకు ప్రజలకు పాదాభివందనలు చేస్తున్నానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) వినయంగా చెప్పారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప్రదీప్ సుకుమార్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నటరాజ్ థియేటర్ వద్ద ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2 వేలమందికి 5 కేజీల వంతున బియ్యం బ్యాగులను, మొక్కలను పంపిణి చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భారీ కేకు కట్ చేశారు. ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ బుడ్డిగ రవి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రిని టీడీపీకి కంచుకోటగా మార్చి వరుస విజయాలు అందిస్తున్న నగర ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తమను కుటుంబ సభ్యులుగా ఆదరిస్తున్న ప్రజల మధ్యకు రావడం గొప్ప అనుభూతిని ఇస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.16 సంవత్సరాలుగా తమ కుటుంబంలో తన తల్లిని మేయరుగా, తండ్రిని ఎమ్మెల్సీగా, తన సతీమణిని ఎమ్మెల్యేగా, ఇప్పుడు తనను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచేందుకు అందరికీ పదవులు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. అనవసర విమర్శలు,అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు తన మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. తాను కన్నెర్ర చేస్తే అన్ని ప్రాంతాల్లో ఉన్న తన అభిమానుల ఆగ్రహాన్ని ప్రత్యర్థులు తట్టుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ వాతావరణ బాగుండాలని, నగరం, మహిళలు సురక్షితంగా ఉండాలని తాను కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ముందస్తు పుట్టిన రోజు వేడుకల నిర్వాహకుడు యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప్రదీప్ సుకుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నయ్య ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన అక్కసుతో, అసుయతో వాసు అన్నయ్యను ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నారని, కాని రాజమండ్రి సిటీలో ఎవ్రీ టైమ్ ఆయనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అని, రానున్న రోజుల్లో మంత్రిగా పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటారని ఆయన ఆకాంక్షించారు. ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి మంచిచెడ్డలు చూసే యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిజమైన ప్రజా నాయకుడని 43 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వాసు‌మరో 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలని ఆశీస్సులు అందచేశారు. నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకి రామయ్య, రాచపల్లి ప్రసాద్, కూటమి నాయకుడు దొండపాటి సత్యం బాబు, యెనుముల రంగబాబు, నగర తెలుగు మహిళ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

– యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప్రదీప్ ఆధ్వర్యంలో…
– 2వేల మందికి 5 కిలోల వంతున బియ్యం బ్యాగులు పంపిణి
– భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే. ఆదిరెడ్డి శ్రీనివాస్
– ఈవీఎం ఎమ్మెల్యే కాదు ఎవ్రీ టైమ్ రాజమండ్రిసిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు: డాక్టర్ యాళ్ళ ప్రదీప్
– మరో 20 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది… ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా ఉంటారు : నాయకులు
రాజమహేద్రవరం :
రాష్ట్రంలో ఏగాలి వీచినా రాజమండ్రిలో టీడీపీ జెండా ఎగరవేస్తున్న, మహిళలకు ప్రజలకు పాదాభివందనలు చేస్తున్నానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) వినయంగా చెప్పారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప్రదీప్ సుకుమార్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నటరాజ్ థియేటర్ వద్ద ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2 వేలమందికి 5 కేజీల వంతున బియ్యం బ్యాగులను, మొక్కలను పంపిణి చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భారీ కేకు కట్ చేశారు. ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ బుడ్డిగ రవి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రిని టీడీపీకి కంచుకోటగా మార్చి వరుస విజయాలు అందిస్తున్న నగర ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

తమను కుటుంబ సభ్యులుగా ఆదరిస్తున్న ప్రజల మధ్యకు రావడం గొప్ప అనుభూతిని ఇస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.16 సంవత్సరాలుగా తమ కుటుంబంలో తన తల్లిని మేయరుగా, తండ్రిని ఎమ్మెల్సీగా, తన సతీమణిని ఎమ్మెల్యేగా, ఇప్పుడు తనను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచేందుకు
అందరికీ పదవులు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. అనవసర విమర్శలు,అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు తన మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. తాను కన్నెర్ర చేస్తే అన్ని ప్రాంతాల్లో ఉన్న తన అభిమానుల ఆగ్రహాన్ని ప్రత్యర్థులు తట్టుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ వాతావరణ బాగుండాలని, నగరం, మహిళలు సురక్షితంగా ఉండాలని తాను కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ముందస్తు పుట్టిన రోజు వేడుకల నిర్వాహకుడు యాళ్ళ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ యాళ్ళ ప్రదీప్ సుకుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నయ్య ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన అక్కసుతో, అసుయతో వాసు అన్నయ్యను ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నారని, కాని రాజమండ్రి సిటీలో ఎవ్రీ టైమ్ ఆయనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అని, రానున్న రోజుల్లో మంత్రిగా పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటారని ఆయన ఆకాంక్షించారు. ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి మంచిచెడ్డలు చూసే యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిజమైన ప్రజా నాయకుడని 43 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వాసు‌మరో 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలని ఆశీస్సులు అందచేశారు.
నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకి రామయ్య, రాచపల్లి ప్రసాద్, కూటమి నాయకుడు దొండపాటి సత్యం బాబు, యెనుముల రంగబాబు, నగర తెలుగు మహిళ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.