అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి పిలుపు మేరకు అంగన్వాడి లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనంతసాగరం మండల తహసిల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనంతసాగరం ప్రాజెక్ట్ CITU నాయకురాలు సునీత మాట్లాడుతూ ప్రీ స్కూల్ ను బలోపితం చేయాలని 3నుండి 6సంవత్సరాల పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో ఉండే విధంగా ప్రభుత్వం G.O ఇవ్వాలని అన్నారు.ప్రీ స్కూల్ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అమలుచేయాలని, ప్రీస్కూల్ పిల్లలకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు ఇవ్వాలని, పిల్లలకు ఇచ్చే మెనూ క్వాంటిటీని పెంచాలని అన్నారు.అలాగే F.R.S యాప్ రద్దు చేయాలని, అంగన్వాడి లకు అదనపు పని భారం రద్దు చేసి ఆన్లైన్ వర్క్ తగ్గించాలని,ఆన్లైన్ వర్క్ కోసం కొత్త 5G ఫోన్లు ఇవ్వాలని అన్నారు. అంగన్వాడి లు ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలిగించి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి అన్వర్ బాషా, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సుబ్బమ్మ,పెంచలమ్మ, నిర్మలా,నూర్జహాన్, మధునిక, అనిత, మదీన, జ్యోతి,భారతి,బేబీ,
బుజ్జమ్మ మరియు అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు.

అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను బలోపితం చేయాలి.
అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి పిలుపు మేరకు అంగన్వాడి లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనంతసాగరం మండల తహసిల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనంతసాగరం ప్రాజెక్ట్ CITU నాయకురాలు సునీత మాట్లాడుతూ ప్రీ స్కూల్ ను బలోపితం చేయాలని 3నుండి 6సంవత్సరాల పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో ఉండే విధంగా ప్రభుత్వం G.O ఇవ్వాలని అన్నారు.ప్రీ స్కూల్ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అమలుచేయాలని, ప్రీస్కూల్ పిల్లలకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు ఇవ్వాలని, పిల్లలకు ఇచ్చే మెనూ క్వాంటిటీని పెంచాలని అన్నారు.అలాగే F.R.S యాప్ రద్దు చేయాలని, అంగన్వాడి లకు అదనపు పని భారం రద్దు చేసి ఆన్లైన్ వర్క్ తగ్గించాలని,ఆన్లైన్ వర్క్ కోసం కొత్త 5G ఫోన్లు ఇవ్వాలని అన్నారు. అంగన్వాడి లు ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలిగించి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి అన్వర్ బాషా, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సుబ్బమ్మ,పెంచలమ్మ, నిర్మలా,నూర్జహాన్, మధునిక, అనిత, మదీన, జ్యోతి,భారతి,బేబీ, బుజ్జమ్మ మరియు అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు.

