*అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ వితరణ ఇచ్చిన కే పార్థసారథి
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నవంబర్ 14 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) పట్టణ ంలోని గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్బంగా రైల్వే కోడూరు గ్రామ పంచాయితీ కార్యాలయం నందు జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కాకుమూరి నరసింహులు ఆర్థిక సహకారంతో రైల్వే కోడూరు పట్టణ పరిధిలోని తోటిళ్లు అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ ను ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారధి అందజేశారు.
పిల్లల వసతి కొరకు అభ్యర్థించగా వెంటనే స్పందించి సీలింగ్ ఫ్యాన్ అందించినందుకు దాత కాకుమూరి నరసింహులు కు ట్రస్ట్ చైర్మన్ పార్థసారధి, అంగన్వాడీ కార్యకర్త డి. కాత్యాయని, సహాయకురాలు ప్రభావతి, ప్రజలు, పిల్లలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాలల దినోత్సవం సందర్బంగా పిల్లలకు స్వీట్స్ అందజేశారు.


