Wednesday, 25 March 2026
  • Home  
  • అంగన్వాడీలను బలోపేతం చేయండి
- E-పేపర్

అంగన్వాడీలను బలోపేతం చేయండి

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలను బలోపేతం చేయాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రెండో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషన్ ట్రాకర్ యాప్ లో ఎఫ్ ఆర్ ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) విధానాన్ని రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ (ప్రైం మినిస్టర్స్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) విద్యను అంగన్వాడి సెంటర్స్ లోనే నిర్వహించాలని పిలుపునిచ్చారు. పియం శ్రీ విద్యను, ప్రీ-స్కూల్ విద్యను స్కూల్స్‌కు మార్చితే, పిల్లలు అంగన్వాడి సెంటర్స్ లో నిర్వహించే పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు కోల్పోతారన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు చదువుతో పాటు ఆహారం, ఆరోగ్య సంరక్షణ కలిపి ఇస్తాయి, ఇది పిల్లల ఆకలి, ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు చిన్న పిల్లల చదువు బోధనలో శిక్షణ పొంది ఉన్నారు. పల్లెల్లో లక్షలాది అంగన్వాడీలు ఉండటం వల్ల పేద, గ్రామీణ పిల్లలు సులభంగా అంగన్‌వాడీ కేంద్రాలలో చేరి, అందరికీ చదువు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా ఉపాధ్యక్షులు G.కిషన్, ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి తొడసం. శoభు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గంగారాము తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలను బలోపేతం చేయాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రెండో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె
మాట్లాడుతూ పోషన్ ట్రాకర్ యాప్ లో ఎఫ్ ఆర్ ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) విధానాన్ని రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ (ప్రైం మినిస్టర్స్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) విద్యను అంగన్వాడి సెంటర్స్ లోనే నిర్వహించాలని పిలుపునిచ్చారు.
పియం శ్రీ విద్యను, ప్రీ-స్కూల్ విద్యను స్కూల్స్‌కు మార్చితే, పిల్లలు అంగన్వాడి సెంటర్స్ లో నిర్వహించే పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు కోల్పోతారన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు చదువుతో పాటు ఆహారం, ఆరోగ్య సంరక్షణ కలిపి ఇస్తాయి, ఇది పిల్లల ఆకలి, ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు చిన్న పిల్లల చదువు బోధనలో శిక్షణ పొంది ఉన్నారు. పల్లెల్లో లక్షలాది అంగన్వాడీలు ఉండటం వల్ల పేద, గ్రామీణ పిల్లలు సులభంగా అంగన్‌వాడీ కేంద్రాలలో చేరి, అందరికీ చదువు అందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో CITU జిల్లా ఉపాధ్యక్షులు G.కిషన్, ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి తొడసం. శoభు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గంగారాము తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.