నందిగామ పట్టణం కాకాని నగర్‌లో బుధవారం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు 5జి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నదని తెలిపారు. పోషణ ట్రాకర్, బాల సంజీవిని యాప్‌ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ వివరాలు, అందుతున్న సేవల సమాచారాన్ని అంగన్వాడీ టీచర్లు నేరుగా నమోదు చేయవచ్చని వివరించారు.
అంగన్వాడీ కేంద్రాలలో జరిగే ప్రతి కార్యక్రమం డిజిటల్‌గా నమోదు కావడం వల్ల పనితీరు లో నాణ్యత పెరుగుతుందని, ప్రభుత్వానికి తక్షణ సమాచారం అందడంతో సేవల అమలులో జవాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాలల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టితో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సీడీపీఓ లక్ష్మీ భార్గవి, ఐసిడిఎస్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లుపాల్గొన్నారు.

అంగన్వాడీలకు 5జి స్మార్ట్ ఫోన్లు పంపిణీ
నందిగామ పట్టణం కాకాని నగర్‌లో బుధవారం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు 5జి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నదని తెలిపారు. పోషణ ట్రాకర్, బాల సంజీవిని యాప్‌ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ వివరాలు, అందుతున్న సేవల సమాచారాన్ని అంగన్వాడీ టీచర్లు నేరుగా నమోదు చేయవచ్చని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో జరిగే ప్రతి కార్యక్రమం డిజిటల్‌గా నమోదు కావడం వల్ల పనితీరు లో నాణ్యత పెరుగుతుందని, ప్రభుత్వానికి తక్షణ సమాచారం అందడంతో సేవల అమలులో జవాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాలల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టితో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సీడీపీఓ లక్ష్మీ భార్గవి, ఐసిడిఎస్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లుపాల్గొన్నారు.

